Telugu Mirror : మీరు బ్యాంక్ లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? బ్యాంక్ లలో డబ్బు దాచుకోవాలని చూస్తున్నారా? ఎక్కువ వడ్డీ రేట్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ ప్రశ్నలు అన్నీ కలిగి ఉన్న వారికి RBI ఒక జవాబును ఇచ్చింది.మీరు సురక్షితంగా మీ డబ్బుకు లాభదాయకమైన వడ్డీని కలిపి ఇచ్చే విధంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) వారు బాండ్లను అందిస్తున్నారు.ఒక వేళ మీకీ విషయం తెలియకుంటే తెలుసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ లపై వడ్డీ రేట్లను ఇటీవల పెంచింది.
Sambar-Case : ఇది ఎక్కడి సాంబారు కేసు రా బాబు!
ఇంతకు ముందు 7.35 శాతం ఉన్న వడ్డీ రేటును ఇప్పుడు 8.05 శాతానికి పెంచినారు. ఇది దాదాపు 70 బేసిస్ పాయింట్ల పెరుగుదలను సూచిస్తుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ సేవింగ్స్ బాండ్ల మీద వడ్డీ రేటు కేంద్ర ప్రభుత్వం అందించే స్మాల్ సేవింగ్స్ పధకం లో భాగమైనా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC ) పైన వచ్చే వడ్డీ రేటుతో అనుసంధానం అయి ఉంటుంది. అంటే మామూలుగా NSC పై వచ్చే వడ్డీ రేటు కన్నా 0.35 శాతం వడ్డీ అధికంగా సేవింగ్స్ బాండ్ ల మీద వస్తుంది.
అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ యొక్క వడ్డీ రేటు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.7 శాతంగా ఉండగా రిజర్వ్ బ్యాంక్ సేవింగ్స్ బాండ్(RBI Bond) లపైన 8.05 శాతం వడ్డీ లభిస్తుంది.కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న పొదుపు పధకాలమీద వడ్డీ రేట్లలోమార్పులు,చేర్పులు చేస్తుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ బాండ్ల మీద మాత్రం వడ్డీ రేట్లను ప్రతి ఆరు నెలలకు ఒకసారి మారతాయని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం జనవరి నెల 1న మరియు జూలై నెలలో 1వ తేదీన వడ్డీ రేట్ల మార్పులు కనిపిస్తాయి. ఇటీవల జూలై 1వ తేదీన RBI సేవింగ్స్ బాండ్ లపైన వడ్డీ రేటు 7.35 శాతం నుంచి 8.05 శాతానికి పెంచింది. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ NSC లమీద వడ్డీ రేట్లు తగ్గిస్తే,రిజర్వ్ బ్యాంక్ బాండ్ల పైన వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి అనే విషయం గమనించాలి.
ToDay Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈ రోజు శనివారం, జూలై 15, 2023 తిథి ,పంచాంగం
రిజర్వ్ బ్యాంక్ అందించే సేవింగ్స్ బాండ్ ల వలన ఉపయోగం ఏమిటంటే..
ఇతర ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంక్ లలో ఫిక్సెడ్ డిపాజిట్(FD) లపైన ఇచ్చే వడ్డీ కంటే RBI బాండ్ లమీద ఇచ్చే వడ్డీ ఎక్కువ గా ఉంటుంది. ఐదు సంవత్సరాల టర్మ్ ఉన్న ఫిక్సెడ్ డిపాజిట్ ల మీద వివిధ బ్యాంక్ లు అందించే వడ్డీ రేట్లను మీరు గాని పరిశీలిస్తే
• స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.5 శాతం వడ్డీ మాత్రమే వస్తుంది.
• హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ 5 ఏళ్ళ కాలపరిమితి ఫిక్సెడ్ డిపాజిట్ పై 7శాతం వడ్డీ ని ఇస్తుంది.
• ICICI లో 7 శాతం వడ్డీ వస్తుంది.
• పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పధకం పైన 7.5శాతం లభిస్తుంది.
• పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కం స్కీమ్ ఖాతా పై 7.4 శాతం వడ్డీ కలిగి ఉంటుంది.
ISRO : నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిసిన చంద్రయాన్-3..
వివిధ బ్యాంక్ లు పోస్ట్ ఆఫీస్ పధకాలకన్నా RBI బాండ్ ల మీదే ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది.ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ (RBI) బాండ్ల లో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. కనీసంరూ.1000 నుంచి డిపాజిట్ మొదలు పెట్ట వచ్చు. ఎంత సొమ్ము వరకు డిపాజిట్ చేయగలుగు తారనేది మీ ఇష్టం.ఈ బాండ్ ల యొక్క కాలపరిమితి7 సంవత్సరాలుగా ఉంటుంది.60 సంవత్సరాలకు పైబడిన వారు అంటే సీనియర్ సిటిజన్ లు కాలపరిమితి ముగియ కుండానే డబ్బులు విత్ డ్రా చేసే అవకాశం కలిగి ఉంది.వడ్డీ ప్రతి 6 నెలలకు ఒకసారి చెల్లిస్తుంటుంది రిజర్వ్ బ్యాంక్.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…