Reserve Bank of India : ఆర్బీఐ గతంలో 500, 1000 నోట్లను రద్దు చేసి.. ఆ తర్వాత కొత్త 200, 500 నోట్లను విడుదల చేసింది. ఆ తర్వాత రెండు వేల నోట్లు తీసుకొచ్చింది. 2,000 నోట్లను కొన్ని రోజులకొకసారి చలామణి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రకటన వెలువడిన ఏడాది తర్వాత కూడా రూ.2,000 నోట్లను కలిగి ఉన్న ఎవరైనా వాటిని మార్చుకునేందుకు ఆర్‌బీఐ అవకాశం కల్పిస్తుంది.
2000 నోట్లను RBI ప్రాంతీయ శాఖలలో మార్చుకోవచ్చు. అయితే చాలా మంది నోట్లు మార్చుకోవడం లేదు. 2000 రూపాయల నోట్లు ఎక్కడా అందుబాటులో లేవు. అయితే తమ వద్ద ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయని ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.
ఇప్పటికీ ఈ నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం, వాటిని బహిరంగంగా ఎక్కడా ఉపయోగించలేరు. మార్పులు RBI ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే సాధ్యమవుతాయి. అయితే, ఇప్పటికీ వేల కోట్ల రూపాయల విలువైన రూ.2000 నోట్లను ప్రజలు కలిగి ఉండడం గమనార్హం. తాజాగా రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) మరో కీలక ప్రకటన చేసింది.
ప్రజల వద్ద ఉన్న రూ.2,000 కరెన్సీ నోట్లలో (currency notes) 97.82% బ్యాంకింగ్ వ్యవస్థలోకి పునరుద్ధరించబడినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించింది. రూ.7,755 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.
మే 19, 2023న చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవాలని ఆర్బీఐ ప్రకటించింది. ఆ తేదీ నాటికి రూ.2 వేల నోట్ల మార్కెట్ విలువ రూ. 3.56 లక్షల కోట్లు ఉండగా..మే 31, 2024 నాటికి ఇది రూ. 7,755 కోట్లుకి పడిపోయింది అని ఆర్‌బీఐ తెలిపింది.
రూ.2 వేల నోట్లను మే 19, 2023 నుంచి రిటైర్ చేస్తామని ప్రకటించిన ఆర్బీఐ.. ఆ తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ చేసి మార్చుకునేందుకు నాలుగు నెలల గడువు ఇచ్చింది. ఆ తర్వాత మరో పది రోజులు గడువు పొడిగించారు.
అయినప్పటికీ, నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నందున, ప్రజలు దేశవ్యాప్తంగా RBI యొక్క 19 ప్రాంతీయ కార్యాలయాలలో దేనిలోనైనా వాటిని మార్చుకోవచ్చు. ప్రస్తుతం రూ.2 వేల నోట్లు చలామణిలో లేవు. అయితే ఆర్‌బీఐ కార్యాలయాలకు నోట్లు వస్తూనే ఉన్నాయి.
Reserve Bank of India
Also Read : Gold and Silver Rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.