Role Of Aspirin: రెండవ సారి హార్ట్ స్ట్రోక్ నివారణలో ఆస్పిరిన్ పాత్ర

Telugu Mirror: యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వారు ఇటీవల జరిపిన అధ్యయనంలో గుండెపోటు వచ్చినవారు కార్డియాలజిస్ట్ సూచన మేరకు ఆస్పిరిన్ మాత్ర (Aspirin Tablet) ను వాడక పోవడం రెండవ సారి గుండెపోటు మరియు మరణానికి కూడా దారితీస్తుందని అధ్యయనాలలో కనుగొంది . 40 సంవత్సరాలు వయస్సు దాటిన వారు మరియు గతంలో గుండెపోటు (Heart Stroke) వచ్చిన వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు.

ఆస్పిరిన్ వాడకం వలన రక్తం పలుచగా చేస్తుంది అలాగే రక్త నాళాలలో రక్తం గడ్డకట్టకుండా, అడ్డంకులు ఏర్పడకుండా పని చేస్తుంది. గతంలో గుండె పోటుకు గురై దాని నుండి బయటపడి ఉన్నవారికి డాక్టర్ ఆస్పిరిన్ తీసుకోవాలని సూచిస్తే మీరు తప్పనిసరిగా డాక్టర్ సలహా ని అనుసరించాలి. ఒకవేళ డాక్టర్ మీకు ఆస్పిరిన్ సూచించని సమయంలో, మీరు స్వంతంగా ఆస్పిరిన్ తీసుకోవాలని అనుకుంటే తప్పనిసరిగా మీరు వైద్యుల సూచన తీసుకుని వారు ఆమోదించిన తరువాతే వాడాలి. మద్యపానం (Consuming Alcohol), ధూమపానం (Smoking) అలవాట్లకు దూరంగా ఉండడం తోపాటు మీ రక్త పోటును నియంత్రణలో ఉంచుకోవడం వలన మయో కార్డియల్ ఇన్ఫార్క్షన్ లేదా తిరిగి మరోసారి గుండెపోటు వచ్చే అవకాశాన్ని నిరోధించవచ్చు.
మీరు ఆస్పిరిన్ వాడటం తిరిగి మరోసారి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా పని చేయిస్తుంది. ప్లేట్‌లెట్స్ గా పిలువబడే చిన్న రక్త కణాలను గడ్డకట్టకుండా నిరోధిస్తుంది.

Aspirin will protect from second stroke after using it from first stroke
Image credit: simple post

Effects of Tea : ‘టీ’ వల్ల వచ్చే దుష్ప్రయోజనాలు మరియు నియంత్రణకై నిపుణుల మాటలు.

రెండవ గుండెపోటు నివారణలో ఆస్పిరిన్ పాత్ర

ఫరీదాబాద్‌ (Faridabad) లోని మారెంగో ఏషియా హాస్పిటల్స్‌లోని కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ గజిందర్ కుమార్ గోయల్ (Dr. Gajinder Kumar Goyal) ప్రకారం గుండెపోటు ఒకసారి వచ్చి బతికి ఉన్నవారికి మరొకసారి వచ్చే ప్రమాదం ఉందని వారు ఆస్పిరిన్ తీసుకోవడం రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు.
“ధూమపానం, మధుమేహం , అనారోగ్యకరమైన ఆహారం,జెనెటిక్స్, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం మరియు గాలి కాలుష్యం వంటి పెద్ద సంఖ్యలో గల కారకాలు గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. గుండెపోటు మరియు స్ట్రోక్ నుండి తప్పించుకున్నవారు తరచుగా తిరిగి ఆ సంఘటన జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి వారు ఆస్పిరిన్ తీసుకోవడం మూలాన మరలా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది, ఆస్పిరిన్ రక్తం పలుచగా చేస్తుంది, ప్లేట్‌లెట్స్ ని గడ్డకట్టకుండా నిరోధిస్తుంది.

రక్తంలో ఏర్పడే గడ్డలు ధమనులలి రక్త సరఫరాని నిరోధించవచ్చు మరియు ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు సరఫరా చేయడంలో తగ్గుదలకు దారితీయవచ్చు. రక్త సరఫరాలో ఇటువంటి అడ్డంకులు గుండెపోటు లేదా స్ట్రోక్‌తో సహా అనేక ఇతర సమస్యలకు కూడా కారణం కావచ్చు.

స్వంతంగా మందులను తీసుకోవడానికి దూరంగా ఉండటం మంచిది. ఆస్పిరిన్ వాడే ముందు డాక్టర్ ని సంప్రదించాలని గట్టిగా సూచన చేశారు. రోగి యొక్క గుండె సంబంధ వ్యాధులు  మరియు ఆస్పిరిన్ వాడకం యొక్క వైద్య చరిత్ర కూడా ప్రిస్క్రిప్షన్‌కు ముందు అవసరం మేరకు పరిశోధించబడుతుంది” అని డాక్టర్ గోయల్ వార్తా సంస్థలతో పేర్కొన్నారు.
రక్తస్రావం లేదా గడ్డకట్టే జబ్బు, ఆస్పిరిన్ అలెర్జీ, రక్తస్రావం కడుపు పూత లేదా జీర్ణా శయంలో రక్తస్రావం చరిత్ర ఉన్న రోగులు ఆస్పిరిన్ వాడకుండా ఉండాలని డాక్టర్ గోయల్ గట్టిగా హెచ్చరిస్తున్నారు, ఎందుకంటే ఇది రక్తస్రావం, ఉబ్బసం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

రెండవ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే చర్యలు

గుండె పోటు వచ్చి ప్రాణాలతో బయటపడిన వారికి మరో సారి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని నివారించడానికి డాక్టర్ గోయల్ ఈ క్రింది విషయాలను సూచిస్తున్నారు:

మీ రక్తపోటును అదుపులో ఉంచుకోండి

రక్తపోటు లేదా అధిక రక్తపోటు గుండె జబ్బులకు అత్యంత సహజ ప్రమాద కారకాలు, కాబట్టి ప్రతిరోజూ కనీసం 30-45 నిమిషాలు వ్యాయామం చేయడం, ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవడం, రక్తపోటు లేదా అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఉప్పు తినకపోవడం మంచిది.

ధూమపానం వద్దు అని చెప్పండి

పొగ త్రాగడం మానేయండి, ఎందుకంటే మీరు ధూమపానం చేసినప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం మరియు చనిపోయే అవకాశం రెట్టింపు అవుతుంది.

మీ బరువును అదుపులో ఉంచుకోండి

బరువు తగ్గడం రెండవ సారి గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఊబకాయం లేదా అధిక బరువు ఉన్న వ్యక్తులు యొక్క శరీరానికి ఆక్సిజన్ మరియు పోషకాలను సరఫరా చేయడానికి ఎక్కువ రక్తం అవసరమవుతుంది, ఇది రక్తపోటు అధికం అవడానికి కారణమవుతుంది.

మీ మందులతో క్రమం తప్పకుండా ఉండండి

వైద్యులు సూచించిన విధంగా మీ మందులను సక్రమంగా వాడండి మరియు రోజూ డాక్టర్ ను సంప్రదించండి. గుండెపోటు వచ్చి ప్రాణాలతో బయటపడిన వారికి మాత్రమే ఆస్పిరిన్ సిఫార్సు చేయబడుతుందని, అంతేకానీ గుండెపోటు రావడాన్ని ఆపడానికి కాదని డాక్టర్ గోయల్ చెప్పారు.
“మీకు ఇప్పటికే హృదయ సంబంధ వ్యాధులు, ఇస్కీమిక్ స్ట్రోక్ లేదా పెరిఫెరల్ వాస్కులర్ వ్యాధి ఉంటే ఆస్పిరిన్ సిఫార్స్ చేయబడుతుంది. ఈ రోగులకు వైద్యులు ఆస్పిరిన్‌ను ఆపితే, తిరిగి వచ్చే ప్రమాదం ఉంది. కానీ గుండె మరియు ఇతర వాస్కులర్ వ్యాధుల ప్రాథమిక నివారణకు ఆస్పిరిన్ సిఫార్స్ చేయబడదు.” అని వైద్య నిపుణుడు పేర్కొన్నారు.

గమనిక : ఈ సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడింది. పాఠకులకు జ్ఞానము మరియు అవగాహన పెంచడానికి సంబంధిత కథనం తయారు చేయబడింది. పై కథనంలో పేర్కొన్న సమాచారం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.

Leave A Reply

Your email address will not be published.