Telugu Mirror : రాయల్ ఎన్ ఫీల్డ్ మార్కెట్ లో తనకున్న రాయల్టీని మరో సారి చూపెట్టింది. తాజాగా గత సంవత్సరం ఆగస్ట్ లో ప్రారంభించబడిన రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 అమ్మకాల యొక్క గణాంకాలలో సక్సెస్ ఫుల్ బైక్ గా నిలిచింది.ఏడాదిలో 2,00,000 యూనిట్లకు పైగా అమ్మకాలు జరపడం ద్వారా హంటర్ 350 బైక్ అధిక విక్రయాల మైలురాయిని సాధించింది. ఆగష్టు 2022లో ప్రారంభించబడిన ఈ బైక్ అధికమైన అమ్మకాలను పొందింది.2023 ఫిబ్రవరి లోనే ఎన్ ఫీల్డ్ హంటర్ 350 బైక్ 1లక్ష విక్రయాల మైలురాయిని దాటింది.
రాయల్ ఎన్ ఫీల్డ్ J ప్లాట్ ఫామ్ పైన విడుదలైన 3వ మోటార్ సైకిల్ రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350.రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 ధరలు వచ్చేసి (ఎక్స్ షో రూమ్,ఢిల్లీ) రూ.1.50 నుంచి రూ.1.74 లక్షల రేంజ్ లో ఉంటుంది.
Nutritious food–పౌష్టికాహార లోపం పిల్లలకు శాపం..తల్లిదండ్రుల మీదే కాపాడే భారం..
వేరియంట్స్ :
రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 బైక్ రెండు వేరియంట్ లలో లభిస్తుంది. అవి మెట్రో మరియు రెట్రో వేరియంట్ లలో అందుబాటులో ఉంది. మెట్రో వేరియంట్ అల్లాయ్ వీల్స్ మరియు డ్యూయల్ డిస్క్ లను కలిగి ఉంటుంది.అదేవిధంగా హంటర్ 350 మెట్రో వేరియంట్ డాపర్ వైట్,డాపర్ యాష్,డాపర్ గ్రే,రెబెల్ బ్లాక్, రెబెల్ బ్లూ మరియు రెబెల్ రెడ్ లతో సహా ఆరు ఆకర్షణీయమైన కలర్స్ లో లభిస్తుంది. అదేవిధంగా రెట్రో వేరియంట్ సింగల్ డిస్క్ సెటప్ తో పాటు స్పోక్ వీల్స్ ను కలిగి ఉంటుంది. ఇకపోతే రెట్రో వేరియంట్ ఫ్యాక్టరీ బ్లాక్ మరియు ఫ్యాక్టరీ సిల్వర్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
ఇంజిన్ మరియు హార్డ్ వేర్:
రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుండి గతంలో విడుదలైన మెటోర్ 350 మరియు క్లాసిక్ 350 విడుదలైన జె సిరీస్ ప్లాట్ ఫామ్ లోనే హంటర్ 350 కూడా జై సిరీస్ లోనే భాగస్వామి అయినది. హంటర్ 350 మోటార్ బైక్ ఇంజన్ 350cc ఫ్యూయల్ ఇంజెక్టెడ్ యూనిట్ ను కలిగి ఉండి 5- స్పీడ్ గేర్ బాక్స్ తో ఉంటుంది. ఈ ఫీచర్స్ మెటోర్ 350 అలాగే క్లాసిక్ 350 లో కూడా కనిపిస్తాయి. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 యొక్క ఇంజన్ అత్యధిక టార్క్ 6,100rpm వద్ద 20.2 హార్స్ పవర్ (hp) శక్తిని విడుదల చేస్తుంది. 4,000rpm వద్ద 27Nm పవర్ ని జనరేట్ చేస్తుంది.
Desi Ghee : బ్యూటీ పార్లర్ కి వద్దు..దేశీ నెయ్యి ముద్దు.. చర్మం నిగారింపు ఇప్పుడు నెయ్యితో?
హంటర్ 350 130mm ట్రావెల్ తో ఫ్రంట్ పార్ట్ లో 41mm ఫోర్క్ లను కలిగి వస్తుంది.అలానే బ్యాక్ పార్ట్ లో షాక్ అబ్జార్బర్ లు 102mm ట్రావెల్ ని ఇస్తాయి.ముందు భాగంలో 300mm డిస్క్ ఉంటుంది. వెనుక డిస్క్ 270mm లో ఉంది.హంటర్ 350 లో అద్భుతమైన బ్రేకింగ్ ను డ్యూయల్ – ఛానల్ ABS సిస్టమ్ ద్వారా ఆపరేట్ అవుతుందని భావిస్తున్నారు.హంటర్ 350 బైక్ యొక్క సీటు ఎత్తు 800mm.ఈ బైక్ లోని 17-ఇంచ్ ల వీల్స్ నగరాలలో మరియు హైవేలో గొప్ప ఫ్లెక్సీబిలిటీ ని కలిగి యుక్తి గా రైడ్ కు అనుకూలంగా ఉంటుంది.
స్పెసిఫికేషన్స్:
రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 బైక్ లో సెమీ-డిజిటల్ యూనిట్,USB పోర్ట్,సర్క్యులర్ హెడ్ ల్యాంప్స్ అలాగే టెయిల్ ల్యాంప్స్ తోపాటు స్విచ్ ఇగ్నిషన్ బటన్ అలాగే మరికొన్ని స్పెసిఫికేషన్లు ఉన్నాయి.