Royal Enfield : కేవలం 18,700 రూపాయలకే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్?
Royal Enfield : రాయల్ ఎన్ ఫీల్డ్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాయల్టీ కి సింబల్ గా కనిపించే బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్. చాలామంది ఈ బైక్ ను జీవితంలో ఒక్కసారైనా వాడాలని ఆశ పడుతుంటారు.
Royal Enfield : రాయల్టీ కి సింబల్ గా కనిపించే బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ (Royal Enfield). చాలామంది ఈ బైక్ ను జీవితంలో ఒక్కసారైనా వాడాలని ఆశ పడుతుంటారు. రాయల్ ఎన్ ఫీల్డ్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బైక్ పై వెళ్తుంటే చాలు. డుగ్… డుగ్ అంటూ వచ్చే సౌండ్ కి ఆ వీధి (street) మొత్తం షేక్ అవ్వాల్సిందే.
అయితే ఈ బైక్ ఖరీదు మాత్రం షాకింగ్ గా ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 -CC బైక్ ఖరీదు, దాదాపుగా రు.1.8 లక్షల వరకు ఉంటుంది. దీనిలోని ఫీచర్లు చాలా బాగుంటాయి. అందుకే ఈ బైక్ ధర సుమారు 2 లక్షల వరకు ఉంది.
అయితే 38 సంవత్సరాల క్రితం రాయల్ ఎన్ ఫీల్డ్ ధర ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యానికి గురి అవ్వాల్సిందే. తాజాగా 38 ఏళ్ల క్రితం ఈ బైక్ కు సంబంధించిన బిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 38 సంవత్సరాల క్రితం ఈ బైక్ ధర తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే.
1986లో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ధర ఆన్ రోడ్ కేవలం 18,700 రూపాయలు మాత్రమే. Royal Enfield Bullet 350 స్టాండర్డ్ మోడల్ బిల్లు ను జార్ఖండ్ లోని సందీప్ ఆటో కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ బిల్లుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
36 సంవత్సరాలలో ఈ బైక్ ధర దాదాపుగా వంద రెట్లు పెరగడం విశేషం. దీనిని చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ధర అందుబాటులో ఉంటే ఓ రెండు, మూడు కొనేయొచ్చు అంటూ, కామెంట్స్ పెడుతున్నారు.
అయితే Royal Enfield మార్కెట్లోకి తాజాగా కొత్త బైక్ ను లాంచ్ చేసేందుకు ఏర్పాటు చేస్తుంది. భారతదేశంలో(India) త్వరలోనే 650 CC ఇంజన్లతో కూడిన కొత్త బుల్లెట్ ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే సంవత్సరంలో ఈ కొత్త బైక్ (New Model Bike) అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Also Read : Royal Enfield : విడుదలకు ముందే గుర్తించబడిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650; వివరాలివిగో
ప్రస్తుతం భారత్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ కు చెందిన 350 CC మరియు 500 CC బైక్ లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో 600 CC బైక్ లు అందుబాటులో ఉండగా, భారత్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
అయితే ఈ బైక్ ఖరీదు (the cost) కనీసం రు.3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
Comments are closed.