Runamafi Latest update : జులై నెల నుండే రుణమాఫీ, ఏకకాలంలో డబ్బులు జమ..!

Runamafi Latest update

Runamafi Latest update : తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతులకు ఆరు హామీలను ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో రైతు భరోసా, రూ. 2 లక్షల రుణమాఫీ (Runa Mafi) , రూ. 500 బియ్యం బోనస్ ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పలు హామీలలను నెరవేర్చారు. రైతుబంధు (Raithu Bandhu) జమ చేస్తున్నారు. అయితే రైతు భరోసా, రుణమాఫీ, వరి పంటకు రూ.500 బోనస్ ఎప్పుడు ఇస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ఆరు హామీలలో కొన్నింటిని అమలు చేయగా మరి కొన్ని అమలు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ చేసిన ఆరు హామీల్లో రూ. 2 లక్షల రుణమాఫీ అత్యంత ముఖ్యమైనది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించనుంది. ఆగస్టు 15లోగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఆ హామీ అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుణమాఫీ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 9వ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేసేందుకు సిద్ధమయ్యారు. రెండు లక్షల కన్నా ఎక్కువ అప్పు ఉంటే.. ప్రభుత్వం నుండి రూ.2లక్షలు అందుతుంది.

Runamafi Latest update

మిగిలిన డబ్బు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. బంగారంతో రుణం తీసుకున్నా రుణం మాఫీ అవుతుందన్న సంగతి తెలిసిందే. మొత్తమ్మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 9వ తేదీలోపు రైతుల రుణాలను మాఫీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

జులైలో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. జూలై 17 ఏకాదశి పర్వదినం. అంతకంటే ముందే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అతి తక్కువ బకాయిలు ఉన్న రైతులతో ప్రారంభించి క్రమంగా రుణాలు మాఫీ చేస్తారు. అయితే గత ప్రభుత్వం విడతల వారీగా రుణమాఫీ చేసింది. అయితే ఐదేళ్లు గడిచినా రుణమాఫీ రాలేదు.

అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తూనే దశలవారీ విధానాన్ని తీసివేసింది. రుణమాఫీకి రూ.31 వేల కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా, 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రుణమాఫీ గడువు విధించినట్లు సీఎం తెలిపారు.

Runamafi Latest update
Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in