Runamafi update : సర్వం సిద్ధం, రుణమాఫీపై త్వరలోనే ప్రకటన
ఆగస్టు 15లోగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఆ హామీ అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. వివరాలలోకి వెళ్తే..
Runamafi update : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత వెంటనే రుణమాఫీపై ప్రకటన వెలువడనుంది. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై పలు ప్రకటనలు కూడా చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
ఆగస్టు 15లోగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఆ హామీ అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రుణమాఫీ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
రాష్ట్రంలో ఎంత మంది రైతులు రూ.రెండు లక్షలు రుణం పొందారు? రుణమాఫీ ఎంత మొత్తం ఉంటుందన్న నివేదికలు ఇప్పటికే రూపొందించారు. అయితే ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అధికారులు తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
అన్నీ సిద్ధం…
అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 9వ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించారు.ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేసేందుకు సిద్ధమయ్యారు. రెండు లక్షల కన్నా ఎక్కువ అప్పు ఉంటే.. ప్రభుత్వం నుండి రూ.2లక్షలు అందుతుంది. మిగిలిన డబ్బు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. బంగారంతో రుణం తీసుకున్నా రుణం మాఫీ అవుతుందన్న సంగతి తెలిసిందే. మొత్తమ్మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 9వ తేదీలోపు రైతుల రుణాలను మాఫీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Comments are closed.