Telugu Mirror : తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రజలకు శుభవార్త చెప్పింది. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో మేనిఫోస్ట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీంట్లో భాగంగా రైతు భరోసా కింద రైతులకు మరియు కౌలుదారులకు ప్రతి ఏటా రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం చేయాలనుకుంటుంది.
అయితే దీనికి సంబంధించి 2024-25 సంవత్సరంలో రూ.37,831 కోట్లు వ్యవసాయరంగానికి కేటాయించినట్లు సమాచారం అందింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఇచ్చిన హామీలను అన్ని అమలు చేయడమనే ఇక లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read : ‘నవరత్నాలు -పేదలందరికీ ఇల్లు’ కింద రూ.46.90 కోట్లు వడ్డీని రీయింబర్స్ చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలలో ఈ రైతు భరోసా (Rythu Bharosa) ఒకటి. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.15,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వేసంగి మరియు వానాకాలం సీజన్లో ఎకరానికి రూ.7,500 చొప్పున ఇస్తారు. రైతు కూలీలకు ఏటా రూ.12,000 చొప్పున ఇవ్వాలనుకుంటుంది.
2023-24 సంవత్సరానికి వ్యవసాయరంగ బడ్జెట్ రూ. 26,831 కోట్లు ఉంది. అయితే ఈసారి మరో 11 కోట్లు పెంచాలని, రైతు భరోసా మరియు రుణామాఫీ పై వ్యవసాయ బడ్జెట్ పెంచాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ తెలిపింది.
రూ.2 లక్షల రుణమాఫీ పథకానికి రూ.25వేల కోట్ల వరకు అవసరం అవుతుంది. అయితే ఈ రుణమాఫీని ఒక్కసారే కాకుండా రూ.5,000 చొప్పున 5 సంవత్సరాలలో మాఫీ చేయొచ్చని తెలిపారు. రైతు భరోసా పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్లోనే అమలు చేయాలని, మే నెల పూర్తయ్యే సరికి ఎండాకాలం పోయి నైరుతి పవనాలు వచ్చే సమయానికి అంటే జూన్ 1 నుండి రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది.
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌలు రైతులకు రైతు బంధు, పెట్టుబడి సాయం, పంట నష్ట పరిహారం అందడం లేదన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులని ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారని బహిరంగ లేఖలో తెలిపిన విషయం తెలిసిందే. యాసంగి పంటకు సంబంధించి రైతుబంధు పథకం కింద రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు. డిసెంబర్ రెండో వారం నుండే మొదట చిన్న రైతులను మొదలుకొని ఎక్కువ భూమి ఉన్న రైతుల వరకు డబ్బు జమ చేయడం జరుగుతుంది.