Rythu Bharosa Funds : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల (6 guarantees) కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేసింది. మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం. తర్వాత ఆరోగ్య శ్రీ (aarogyasri) పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ (Free Current) పథకం అమలు చేయగా, రూ.500 గ్యాస్ సిలిండర్ (Gas Cy;inder)ను కూడా ప్రారంభించింది.
మార్చి నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే మిగిలిన రైతుభరోసా పథకాన్ని కూడా మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ, రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుభరోసా (రైతుబంధు) డబ్బులను సోమవారం విడుదల చేశారు. ఆరు ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయి. 39 లక్షల ఎకరాలకు గానూ రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు (Agriculture Officers) వెల్లడించారు. మే 6 వ తేదీ నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు రైతు భరోసా నగదు మొత్తం అందజేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మే 6 వ తేదీన 4 లక్షలకు పైగా రైతుల ఖాతాలలో నగదు జమ చేయబడింది. రైతు భరోసా డబ్బులు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న వారికి ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల వేళ రైతు భరోసా రాజకీయంగా హాట్ హాట్ గా మారింది.
ఇక, రుణమాఫీ (Runa Mafi) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్ట్ 15వ తేదీలోపు రుణమాఫీ తప్పుకుండా చేస్తామని ఇటీవల పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.