Rythu Bharosa Updates In Telangana Useful Information : రైతులకు రైతు భరోసా పధకం అమలుకు కసరత్తు. పంట సాయం రూ.15వేలు ఇచ్చేది ఎప్పుడంటే?  

Rythu Bharosa Updates
Image Credit : Telugu Mirror

Rythu Bharosa Updates In Telangana Useful Information :  తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో ముఖ్యమైన ఆరు గ్యారంటీల అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆరు గ్యారంటీలలో ఇప్పటికే కొన్ని పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోంది. మిగిలిన హామీలను కూడా అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తలు చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించి అధికారంలోకి తీసుకు వస్తే, తమ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో హామీల అమలులో భాగంగా ఆరు గ్యారంటీల్లోని అన్ని పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కానీ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొత్తగా అమలు చేయాలనుకున్న పథకాల ప్రారంభం ఆగిపోయింది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల విద్యుత్ ఉచిత పధకం, రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇప్పటికే అమలు చేస్తోంది.

అయితే ఇంకా అమలు చేయవలసిన పధకాలైన మహిళలకు రూ.2500, విద్యార్థులకు 5లక్షల విద్యా భరోసా కార్డు, వృద్ధులకు 4వేల పెన్షన్లు, రైతులకు రైతు భరోసా (Rythu Bharosa)కింద ఏటా ఎకరాకు రూ.15వేల ఆర్థిక సాయం వంటి పథకాలు ఉన్నాయి. అయితే పై పధకాలలో ప్రధానంగా రైతుభరోసాపై రేవంత్ ప్రభుత్వం దృష్టి సారించింది.

Rythu Bharosa Updates
Image Credit : Telugu Mirror

When will Rythu Bharosa be given and how much will be given

టీ.ఆర్.యస్. ప్రభుత్వ హయాం నుంచి అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో పలు మార్పులు చేసి.. రైతుభరోసాను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. కొండలు, గుట్టలు ఇతర వ్యవసాయేతర భూములకు కాకుండా, సాగు చేసే భూములకే రైతుభరోసా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రైతు భరోసా పధకం కూడా 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చాలని భావిస్తోంది.

రైతుభరోసా పథకం కింద ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం రైతాంగానికి సంవత్సరానికి ఎకరానికి రూ.15వేలు ఇవ్వనున్నారు. మరి ఈ 15 వేల రూపాయలను ఒకేసారి ఇస్తారా లేక వానాకాలం, యాసంగి పంట కాలానికి.. రెండు విడతల్లో రూ.7,500 చొప్పున ఇవ్వనున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే రైతు భరోసా పధకానికి సంబంధించిన విధి విధానాలు త్వరలో రానున్నాయి.

రైతుభరోసా పథకాన్ని ఈ వానాకాలం సీజన్ లోనే ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వానాకాలంలో పంట పనులు ప్రారంభించడానికి ముందే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రకారంగా అంటే జూన్ 1 నుంచే రైతు భరోసా పధకం క్రింద రూ.15వేల రూపాయల పంపిణీని ప్రారంభించే అవకాశాలున్నాయి.

రైతు భరోసా పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రైతుబంధు పధకం క్రింద పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులకు యధావిధిగా డబ్బులు వస్తాయి. ఐతే ఈసారి అందరికీ కాకుండా, సాగు చేసే రైతుల భూములకు మాత్రమే డబ్బులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తోంది.

Rythu Bharosa Updates In Telangana Useful Information

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in