Rythu Runa Mafi : గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) భారీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి పలు పథకాలను అమలు చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ మరియు రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ప్రస్తుతం తెలంగాణ రేవంత్ సర్కార్ రుణామాఫీపై వేగం పెంచింది. రైతులకు రుణామాఫీ అందించడమే ఇప్పుడు టార్గెట్ గా పెట్టుకున్న రేవంత్ సర్కార్.. ఆగష్టు 15లోగా ఏకకాలంలో రుణామాఫీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు చెప్పారు. అయితే, దీని కోసం పక్క ప్రణాళికలు సిద్దం చేసి మార్గదర్శకాలు రూపొందిస్తుంది. రైతుల నుండి మొత్తం వివరాలను సేకరిస్తుంది. రైతులకు ఇచ్చి మాట నిలబెట్టుకునేందుకు పక్కగా గైడ్ లెన్స్ రూపొందిస్తుంది.
అయితే, తెలంగాణ ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ ను డిసెంబర్ 9కి ఖరార్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ పుట్టిన రోజు కావడం మరియు అదే రోజు తెలంగాణ (Telangana) ఏర్పాటుకు ప్రకటన చేయడంతో డిసెంబర్ 9 వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. రైతుల నుండి వివరాలు సేకరించేందుకు రేవంత్ సర్కార్, 4 విభాగాలు మరియు 30 అంశాలతో ప్రోఫార్మాతో రైతుల సమాచారాన్ని సేకరిస్తుంది. పీఏసీఎఎఎస్ వివరాలు, బ్యాంకుల వివరాలు, రైతుల వివరాలు, రుణం వివరాలు సేకరిస్తుంది.
ఇకపోతే రైతుకు సంబంధించిన ప్రతి వివరాలను సేకరిస్తుంది. అనగా, రైతు పూర్తి పేరు, తండ్రి లేదా భర్త పేరు, రైతు ఆధార్ కార్డ్ నెంబర్, ఫోన్ నంబర్, జండర్, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, రైతు చిరునామా వంటి వివరాలు సేకరిస్తున్నారు.
ఇకపోతే రైతుల లోన్ వివరాలు కూడా సేకరిస్తున్నారు. అందులో, రైతు కస్టమర్ ఐడీ నంబర్, లోన్ అకౌంట్ నంబర్, ఏ విధమైన అకౌంట్, లోన్ టైపు, క్రాప్ లోన్ మంజూర్ అయిన తేదీ, అప్పు తీసుకున్నప్పటి నుండి అసలు మరియు వడ్డీ మొత్తం వివరాలను సేకరిస్తుంది. డిసెంబర్ 9,2023 వరకు అసలు మరియు వడ్డీ, ఇతర ఛార్జీలు, టోటల్ అవుట్స్టాండింగ్ వివరాలు సేకరిస్తుంది. అంతేకాకుండా, మే 19,2024 నాటికి రైతుల అవుట్స్టాండింగ్ వివరాలను సేకరిస్తుంది.
ఒక కుంటుంబానికి రూ.2 లక్షలు మాత్రమే అందుతుంది. ఒకవేళ రుణం ఎక్కువగా ఉంటే, రూ.2 లక్షల వరకు మాఫీ అవుతుంది మిగిలినవి రైతులే తమ చేతుల మీదుగా కట్టుకోవాలి. ఒకవేళ రైతు ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకులలో అప్పు తీసుకుంటే అన్నీ బ్యాంకుల నుండి లెక్క చేసి రూ. 2 లక్షలు రుణామాఫీ చేస్తుంది. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తుంది.
ప్రస్తుతం అయితే, రేవంత్ సర్కార్ రుణామాఫీపై వేగం పెంచింది. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తుంది తెలంగాణ సర్కార్.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…