Rythu Runamafi : రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రైతులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన హామీకి అనుగుణంగా సోమవారం నాడు పాలనాధికారి దీక్షకు ఆదేశాలు జారీ చేయగా ఈరోజు మరింత శుభవార్త అందింది.
రుణమాఫీ అమలుకు కాలపరిమితిని నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుందని అధికార యంత్రాంగం ప్రకటించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సీఎం రేవంత్‌రెడ్డి వంటి వారు కీలక వ్యాఖ్యలు చేశారు.
రైతు రుణమాఫీకి రేషన్ కార్డులు అవసరమని నిబంధనలు సూచిస్తుండగా.. రైతుల్లో ఉన్న అపోహకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ ఉంటుందని కన్ఫర్మ్ చేసి చెప్పారు.
రేషన్ కార్డు కేవలం రైతు కుటుంబమా కదా అనే విషయాన్నీ నిర్దారించుకోడానికి మాత్రమే ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. పాసుపుస్తకం ఆధారంగానే రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 40 లక్షల మంది రుణమాఫీ పొందారని, వీరిలో 6 లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డులు లేవని మంత్రి తెలిపారు.
రుణమాఫీ విధానాన్ని పూర్తిగా అమలు చేసేందుకు రూ.31 వేల కోట్లు అవసరమని మంత్రి తుమ్మల సూచించారు. ఈ నెల 18న రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు 15 నాటికి విడతల వారీగా పూర్తి చేస్తామని ప్రకటించారు. అయితే 18వ తేదీన లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో 18న ఒక్కో రైతు ఖాతాలోకి లక్ష రూపాయలు జమ కానున్నాయి.
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ :
తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ పథకం పనిచేస్తుందని చెప్పారు.
మరోవైపు ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జులై 18 సాయంత్రంలోగా రైతుల రుణాల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.
అదే రోజు రైతుల లొకేషన్లలో రుణమాఫీ గ్రహీతలతో సంబరాలు జరుపుకుంటారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.