Sai Dharam Tej wedding : మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ కి పెళ్లి, మరి ఇంతకీ వధువు ఎవరు?

Sai Dharam Tej wedding

Sai Dharam Tej wedding : మెగాఫ్యామిలీ వరుసగా సంబరాలు చేసుకుంటున్నారు. మెగా వారసురాలు క్లింకర పుట్టడంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది మెగాఫ్యామిలీ. RRR చిత్రంలోని నాటునటు పాటకు అవార్డు లభించింది. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కొంతకాలం తర్వాత వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కేంద్రం చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. ఆ తర్వాత చిరంజీవి భార్య సురేఖ ‘అత్తమ్మ కిచెన్‌’ పేరుతో వ్యాపారిని మొదలు పెట్టారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ సంబరాలు ఇప్పట్లో ముగిసేలా లేవు.

అయితే, ఇప్పుడు మెగా ఫామిలీ (Mega family) లో మరో శుభకార్యం జరుగబోతున్నట్లు తెలుస్తుంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రేయ్ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు, కానీ పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో అందరికి పరిచయం అయ్యాడు.

ఈ చిత్రం తేజ్ కు మంచి పేరు తీసుకురావడంతోనే కాదు మరిన్ని కొత్త అవకాశాలను అందించింది. విజయాలు, అపజయాలు ఎదురైనా వరుస సినిమాలు చేస్తున్నాడు. దీంతో తేజ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. బైక్ ప్రమాదానికి గురై దాదాపు చావు అంచుల నుండి బయటపడ్డాడు.

 ఆ తరువాత, అతను విరూపాక్ష చిత్రంతో మళ్ళీ సినిమాలోకి తిరిగి వచ్చాడు, ఇక ఆ సినిమా పెద్ద హిట్ అయింది. గంజా శంకర్ ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఆ సినిమా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కాల్సింది కానీ ఇంతలో ఈ సినిమా ఆగిపోయింది.

ప్రస్తుతం, సినిమాల గురించి పక్కన పెడితే.. తేజ్ మామ పవన్ కళ్యాణ్ మంత్రి అయ్యాక తేజ్ ఆనందానికి హద్దులు లేవు. ఇక ఆ ఆనందంలో భాగంగానే.. తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని పెద్దలు చర్చించుకుంటున్నారని అంటున్నారు.

ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? అనే వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. పెళ్లికూతురు ఓ వ్యాపారవేత్త కూతురు అని బయట టాక్. నివేదికల ప్రకారం, మెగా ఫ్యామిలీకి ఈ సంబంధం నచ్చిందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Sai Dharam Tej wedding

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in