Samantha-Naga Chaitanya : ఏంటి? సమంత, నాగచైతన్య కలవబోతున్నారా? ఇదేం ట్విస్ట్.
ఏడాదిన్నరగా గడిచినా సినిమాలో కనిపించకున్నా తెలుగులో టాప్ హీరోయిన్ గా మిగిలిపోయిన సమంతను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మయోసైటిస్కు చికిత్స పొందేందుకు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నట్టు ప్రకటించింది
samantha-Naga chaitanya :ఏడాదిన్నరగా గడిచినా సినిమాలో కనిపించకున్నా తెలుగులో టాప్ హీరోయిన్ గా మిగిలిపోయిన సమంతను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మయోసైటిస్కు చికిత్స పొందేందుకు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నట్టు ప్రకటించింది. అప్పటి వరకు నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్ని తిరిగి ఇచ్చేసింది.
మైయోసిటిస్ థెరపీ చేయించుకున్న తర్వాత, ఆమెకు సినిమాలు మరియు వెబ్ సిరీస్లలో కనిపించడానికి అనేక ఆఫర్లు వచ్చాయి. ఆమె తన సొంత నిర్మాణ సంస్థని ఉపయోగించి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేస్తుంది.
అక్కినేని నాగ చైతుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. చైతుతో విడాకులు తీసుకున్న తర్వాత ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. విడాకులు తీసుకున్న నాగ చైతన్య సమంత విషయంలో ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. కానీ, సమంత చాలా సందర్భాల్లో చైతూపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది.
దీంతో అభిమానుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ప్రముఖ సినీ జర్నలిస్ట్ రామారావు ఇటీవల సమంతను ఇంటర్వ్యూ చేసి నాగ చైతన్యపై తనకున్న ప్రేమను బయటపెట్టారు. వారిద్దరికీ ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమ ఉందని, ఎప్పటికీ కలుసుకుంటారని చెప్పారు.
సమంతా బహిరంగంగా చెప్పకపోయినా, నాగ చైతన్యను విడిచిపెట్టినందుకు చింతిస్తున్నట్లు సమంత సన్నిహితులు నమ్ముతున్నారు. చైతూని ఎందుకు వదులుకున్నాననే దాని గురించి ఆమె ఇప్పటికీ బాధని అనుభవిస్తుందని..
ఇది తను చేసిన తప్పని..సమంత భావిస్తున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. జీవితంలోని చేదు అనుభవాలను నేర్చుకొని, మన దగ్గర సన్నిహితులు ఎవరు? వారి శ్రేయోభిలాషులు ఎవరు? అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ దగ్గరికి రానివ్వకూడదని మరియు చివరి వరకు తన ప్రియమైన వారితో ఉండటం గురించి సమంత ఒక ప్రోగ్రాం లో చేసిన వ్యాఖ్యలు ఆమెకే వర్తిస్తాయని..నెటిజన్లు చెబుతున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
samantha-Naga chaitanya
Also Read : Aadhaar Card : మనిషి చనిపోతే వారి ఆధార్ కార్డు ఏమవుతుంది? అసలది పని చేస్తుందా?
Comments are closed.