Galaxy F15 5G : ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్న నేపథ్యంలో చాలా కంపెనీలు 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ సైతం తక్కువ ధరకే 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది..
ఈ ఫోన్ 6.5 అంగుళాల full HD ప్లస్ సూపర్ AMOLED డిస్ ప్లే( AMOLED display ) తో వస్తోంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ చిప్ సెట్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 6000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే రెండు రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. 5జీ, వైఫై, బ్లూటూత్ 5.3, GPS,USB టైప్-C లాంటి ఫీచర్లతో ఉంటుంది. ఈ ఫోన్ 50 మెగా పిక్సెల్ తో కూడిన రెయిన్ కెమెరాతో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఈ F15 5జీ స్మార్ట్ ఫోన్ కు కొత్త RAM వేరియంట్ ను తీసుకొచ్చింది. 8GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది. 4GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది. 6GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది. ఇక సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఈ ఫోన్ పై రూ.1000 డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 5.0 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 4 సంవత్సరాలపాటు OS అప్‌డేట్ మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది.