Samsung Galaxy S21 FE 5G: మొబైల్ మార్కెట్ లో కొత్త Samsung Galaxy S21 FE 5G హవా..వాట్ ఏ ఫోన్? వావ్ అనిపించే ఫీచర్స్

కొరియన్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Samsung లేటెస్ట్ Samsung Galaxy S21 FE 5G జూలై 11 న భారత దేశంలో విడుదల చేసింది. కొత్త Galaxy ఫ్యాన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఈ ఫ్లాగ్ షిప్ మోడల్ ను తీసుకొచ్చామని Samsung తెలిపింది. ఈ హ్యాండ్ సెట్ కేవలం 8GB + 256GB వేరియంట్ లో మాత్రమే విడుదల అయ్యింది. దీని యొక్క ధర రూ.49,999 ఉంది.

Samsung Galaxy S21FE 5G

Samsung Galaxy S21 FE 5G 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.4-inch FHD+ Dynamic AMOLED 2x డిస్ ప్లే తో వస్తుంది మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ ఆలివ్, గ్రాఫైట్, లావెండర్ మరియు వైట్ కలర్ లలో విడుదల అయ్యింది. అలానే నావీ అనే కొత్త కలర్ ఆప్షన్ తో తీసుకొచ్చింది.

Samsung Galaxy S21 FE ట్రిపుల్ కెమెరాలతో వచ్చింది. 12MP + 12MP + 8MP కెమెరా సెట్ అప్ తో వస్తుంది. 12- మెగా పిక్సెల్ వైడ్ కెమెరా, 12- మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా మరియు 8- మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా లెన్స్ మరియు 32- మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో అందుబాటులో ఉంది. 3x ఆప్టికల్ జూమ్ మరియు 30x స్పేస్ జూమ్ సపోర్ట్ తో వస్తుంది. అలానే డ్యుయల్ రికార్డింగ్, పోర్ట్రైట్ మోడ్, ఎన్ హాన్స్డ్ నైట్ మోడ్ వంటి కెమెరా ఫీచర్ లతో వచ్చింది. Samsung కంపెనీ ఈ ఫోన్ లోని కెమెరాల పై అంత దృష్టి సారించలేదు కానీ పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ ఎక్కడ తగ్గదు. Samsung Galaxy S21 FE 8GB RAM మరియు 256GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ హ్యాండ్ సెట్ Andreno 660 GPU తో కలిసిన ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ Qualcomm Snapdragon 888 తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 తో అందుబాటులో ఉంది. అలానే ఈ హ్యాండ్ సెట్ 4,500mAh బ్యాటరీ తో లభిస్తుంది. ఈ ఫోన్ 25W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ డ్యుయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. ప్రస్తుతానికి Samsung Galaxy S21 FE 5G కేవలం Samsung India వారి అఫిషియల్ వెబ్ సైట్ నుంచి మాత్రమే కొనడానికి సాధ్యం దీని యొక్క ధర రూ.49,999.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in