Samsung Galaxy S21 FE ( Fan Edition ) 5G రీ లాంచ్ కు సిద్దంగా ఉంది. పోయిన సంవత్సరం జనవరిలో విడుదల అయిన Samsung Galaxy S21 FE ను మళ్ళీ అప్ గ్రేడ్ చేసి మన ముందుకు త్వరలోనే తీసుకురాబోతున్నారని లీక్ లు వచ్చాయి. Samsung Galaxy S21 FE పోయిన సారి Exynos 2100 SoC తో వచ్చిన విషయం మనకి తెలుసు. కానీ రీ లాంచ్ అవ్వబోతున్న Galaxy S21 FE 5G కొత్త అప్ డేట్ లతో వస్తుంది. ఈ సారి Samsung Galaxy S21 FE 5G Qualcomm Snapdragon 888 SoC ప్రాసెసర్ తో రాబోతున్నది.
IPhone 14 : యాపిల్ ప్రియులకు అమెజాన్ లో పెద్ద డిస్కౌంట్..
Samsung Galaxy S21 FE 5G మరో 15 రోజుల్లో విడుదల అవ్వబోతుందని లీక్ లు తెలిసాయి. అలానే మళ్ళీ కొత్తగా రిలీజ్ అవ్వబోతున్న Galaxy S21 FE 5G లో కొత్త స్టోరేజ్ ఆప్షన్స్ మరియు మరి కొన్ని కలర్స్ లో రాబోతుందని లీక్ లు తెలుపుతున్నాయి. టిప్ స్టర్ అయిన అభిషేక్ యాదవ్ తెలిపిన లీక్ ల ప్రకారం, Samsung Galaxy S21 FE 5G Qualcomm Snapdragon 888 SoC మరియు మన దేశంలో మరో పది రోజుల్లో అందుబాటులోకి రానున్నది వారు తెలిపారు. అలానే ఈ హ్యాండ్ సెట్ 256GB బేస్ మోడల్ మరియు నావి బ్లూ కలర్ లో రాబోతున్నది కూడా తెలియజేశారు.
పోయిన సంవత్సరం విడుదల అయిన Galaxy S21 FE యొక్క బేస్ మోడల్ 128GB స్టోరేజ్ ధర రూ.54,999 మరియు 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.58,999. ప్రస్తుతం ఈ హ్యాండ్ సెట్ యొక్క ధర రూ.32,999.Samsung Galaxy S21 FE 5G 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.4-inch డిస్ ప్లే full HD+ Dynamic AMOLED 2x డిస్ ప్లే తో రాబోతుంది. అలానే 8GB LPDDR5 RAM మరియు 128GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ బేస్ వేరియంట్ తో అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్ సెట్ 32- మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది మరియు ప్రైమరీ కెమెరా గురించి ఇంకా సరైన సమాచారం అందలేదు కానీ మూడు AI కెమెరాలతో రాబోతుంది.
Bank Holidays in July: 15 రోజులు బ్యాంకులు బంద్.. లిస్ట్ ఇదే..
ఈ మూడు కెమెరాలలో రెండు 12- మెగా పిక్సెల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలానే Samsung Galaxy S21 FE 5G 4500mAh బ్యాటరీతో రాబోతుంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీంతోపాటు 15W వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతుంది. ఈ ఫోన్ గురించి చాలా విషయాలను కంపెనీ ఇంకా తెలుపలేదు, ఇవన్నీ లీక్ లు మాత్రమే.