SBI Credit Card Rules : దేశంలోని దిగ్గజ క్రెడిట్ కార్డు (Credit card) కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఎస్‌బీఐ (Sbi) కార్డు తాజాగా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. కొత్త రూల్ తీసుకువచ్చింది. దీని వల్ల ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే వారిపై ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ కంపెనీ ఎలాంటి రూల్ తీసుకువచ్చింది? మారిన అంశాలు ఏంటివి? అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
SBI కార్డ్ తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. రివార్డ్ పాయింట్ల సంఖ్య తగ్గించింది. ఇకపై ప్రభుత్వ లావాదేవీలకు రివార్డ్ పాయింట్లు ఇవ్వబోమని SBI కార్డ్ ప్రకటించింది. అంటే మీరు మీ SBI కార్డ్‌తో ప్రభుత్వ లావాదేవీలు చేస్తే, మీకు ఎలాంటి రివార్డ్ పాయింట్లు అందవు.
ప్రభుత్వ లావాదేవీలు ఇప్పుడు మర్చంట్ కేటగిరీ కోడ్‌లు (MCC) 9399 మరియు 9311 కింద వర్గీకరించబడతాయని SBI కార్డ్ సూచించింది. SBI కార్డ్ నిర్ణయంతో, ప్రభుత్వ లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్‌లు అందించబడవు. SBI కార్డ్ కంపెనీ ఈ విషయాన్ని తన ఖాతాదారులకు ఇమెయిల్ ద్వారా తెలియజేసింది.
మరోవైపు, Yes Bank మరియు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఇప్పటికే తమ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. దీనివల్ల యుటిలిటీ బిల్లు చెల్లింపుదారులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. అన్ని యుటిలిటీ బిల్లులపై 1% రుసుము వసూలు చేస్తామని ఈ బ్యాంకులు వెల్లడించాయి. ఈ నిబంధన ఇప్పటికే అమల్లోకి వచ్చింది.
మీ నెలవారీ కరెంట్ బిల్లు రూ. 1500 అయితే, మీరు దానిని Yes Bank లేదా IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో (credit card) చెల్లిస్తే అప్పుడు మీకు అదనంగా బిల్లు అమౌంట్‌పై రూ. 15 పడుతుంది. అయితే ఇక్కడ కస్టమర్లకు కొంత ఊరట లభించింది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడితే రూ. 15 వేల వరకు ఫ్రీ యూసేజ్ లిమిట్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC)అయితే రూ. 20 వేల వరకు లిమిట్ వస్తుంది. అంటే క్రెడిట్ కార్డు బిల్లు సైకిల్‌లో రూ. 15 వేల లోపు యుటిలిటీ బిల్లుల చెల్లింపుపై ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. ఈ లిమిట్ దాటి బిల్లు పే చేస్తే అప్పుడు ఒక శాతం ఫీజు చెల్లించుకోవాలి. దీనికి 18 శాతం జీఎస్‌టీ కూడా పడుతుంది. అందువల్ల ఈ మూడు బ్యాంకుల క్రెడిట్ కార్డులు వాడే వారు ఈ కొత్త రూల్స్ చెక్ చేసుకోవడం ఉత్తమం.