SBI Credit Cards : వేసవి సెలవులు వచ్చాయి. పిల్లలు, పెద్దలు కొత్త కొత్త ప్రదేశాలను పర్యటిస్తూ ఉంటారు. అక్కడికి ఇక్కడి కి అని వెళ్ళి సేవింగ్స్ చేసుకున్న డబ్బు మొత్తం ఐస్ క్రీం లా కరిగిపోతాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, బంధువులతో కలిసి వివిధ ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తే డబ్బు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసేవారికి ఎస్బీఐ (SBI)మూడు కొత్త కార్డులను ప్రవేశ పెట్టింది. ఇంతకీ ఈ కార్డ్స్ ఏంటి? వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి ? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
ఈ కార్డ్ మైల్స్ అనే మూడు విభిన్న SBI కార్డ్ వేరియంట్‌లలో ఉంటుంది.
1. SBI కార్డ్ మైల్స్ ఎలైట్
2. SBI కార్డ్ మైల్స్ ప్రైమ్
3. SBI కార్డ్ మైల్స్ (SBI కార్డ్ మైల్స్).
ఇవి పర్యాటకులకు మాత్రమే కాదు సాధారణ ప్రయాణీకులకు కూడా ఉపయోగపడతాయి. ఈ మూడు కొత్త క్రెడిట్ కార్డ్‌లు మాస్టర్ కార్డ్ మరియు రూపే నెట్‌వర్క్‌లలో అందుబాటులో ఉన్నాయి.
ప్రయోజనాలు ఏంటి ఒకసారి చూద్దాం ?
ప్రతి SBI కార్డ్ మైల్స్ ఎలైట్, SBI కార్డ్ మైల్స్ ప్రైమ్ లేదా SBI కార్డ్ మైల్స్ లావాదేవీల కోసం ట్రావెల్ క్రెడిట్‌లు.. కార్డ్ హోల్డర్ ఖాతాకు జమ చేయబడతాయి. ఈ ప్రయాణ క్రెడిట్‌లను ఎయిర్‌లైన్ (Airline) మైళ్లు మరియు హోటల్ పాయింట్‌లుగా కూడా మార్చుకోవచ్చు. ఈ కార్డ్‌లతో చేసిన ప్రతి ప్రయాణ బుకింగ్‌కు తగ్గింపు లభిస్తుంది. ఎయిర్ విస్తారా, ఎయిర్ ఇండియా, ITC హోటల్స్ మరియు అకార్‌తో సహా 20 సంస్థలతో భాగస్వామ్యం ఎస్బిఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్య కంపెనీలతో విమానాలు మరియు హోటల్‌లను కొనుగోలు చేయడానికి ఈ క్రెడిట్‌లను ఉపయోగించవచ్చు.
SBI Card Miles :
ఈ కార్డ్ వెల్‌కమ్ ఆఫర్‌లో రూ.1500 ట్రావెల్ క్రెడిట్‌లు లాభిస్తాయి. ప్రయాణానికి ఖర్చు చేసే ప్రతి రూ.200కి రెండు ట్రావెల్ క్రెడిట్‌లు, ఇతర ఖర్చులకు ఒక ట్రావెల్ క్రెడిట్ (Travel credit) పొందవచ్చు. రూ. 1 లక్ష ఖర్చు చేస్తే మీకు డొమెస్టిక్ లాంజ్‌లో అదనపు యాక్సిస్ లభిస్తుంది. రూ.వెయ్యి ఖర్చు చేస్తే, ఒక సంవత్సరంలో 5 లక్షలు, మీరు 5000 బోనస్ ట్రావెల్ క్రెడిట్‌లను అందుకుంటారు.
సంవత్సరానికి ఖర్చు రూ.6 లక్షలు దాటితే, ఫీజు వాపస్ వస్తుంది. నాలుగు దేశీయ లాంజ్ యాక్సిస్ ఉంటుంది.ప్రయారిటీ పాస్ సభ్యత్వం ప్రపంచవ్యాప్తంగా 1,000 ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ మంజూరు చేస్తుంది.విదేశాలలో ఉపయోగించినప్పుడు, ఈ కార్డ్‌కు కేవలం 3% విదేశీ కరెన్సీ మార్కప్ ఛార్జీ, అన్ని పెట్రోల్ పంపుల వద్ద 1% సర్‌ఛార్జ్ రాయితీ మరియు వార్షిక ధర రూ.1499 + GST ఉంటుంది .
SBI Card Miles Elite :
ఈ కార్డ్ వెల్‌కమ్ ఆఫర్‌లో రూ.5000 ట్రావెల్ క్రెడిట్‌లు లాభిస్తాయి. ప్రయాణానికి ఖర్చు చేసే ప్రతి రూ.200కి ఆరు ట్రావెల్ క్రెడిట్‌లు, ఇతర ఖర్చులకు రెండు ట్రావెల్ క్రెడిట్ పొందవచ్చు. మీరు సంవత్సరానికి రూ.12 లక్షలు ఖర్చు చేస్తే, మీరు 20,000 అదనపు ప్రయాణ క్రెడిట్‌లను అందుకుంటారు.అలాగే మీరు రూ.15 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే వార్షిక రుసుము మాఫీ అవుతుంది.
ప్రయారిటీ పాస్ సభ్యత్వం ప్రపంచవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ లభిస్తుంది. ప్రతి సంవత్సరం, ఎనిమిది దేశీయ లాంజ్‌లు అందుబాటులో ఉంటాయి.
ఈ కార్డును విదేశాలలో ఉపయోగించినప్పుడు, అన్ని పెట్రోల్ పంపుల వద్ద 1% సర్‌ఛార్జ్ మినహాయింపు , విమాన రద్దు మరియు విమాన ప్రమాద బీమాను అందుకుంటారు. ఇంకా వార్షిక ధర రూ.4999 + GST ఉంటుంది .
SBI Card Miles Prime :
ఈ కార్డ్ వెల్‌కమ్ ఆఫర్‌లో రూ.3000 ట్రావెల్ క్రెడిట్‌లు లాభిస్తాయి. ప్రయాణానికి ఖర్చు చేసే ప్రతి రూ.200కి నాలుగు ట్రావెల్ క్రెడిట్‌లు, ఇతర ఖర్చులకు రెండు ట్రావెల్ క్రెడిట్ పొందవచ్చు. మీరు సంవత్సరానికి రూ.8 లక్షలు ఖర్చు చేస్తే, మీరు 10,000 అదనపు ప్రయాణ క్రెడిట్‌లను అందుకుంటారు. అలాగే మీరు రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే వార్షిక రుసుము వాపసు కూడా అందుకుంటారు.
సంవత్సరానికి రూ.6 లక్షలు దాటితే, ఫీజు వాపస్ వస్తుంది.
నాలుగు దేశీయ లాంజ్ యాక్సిస్ ఉంటుంది. ప్రయారిటీ పాస్ సభ్యత్వం ప్రపంచవ్యాప్తంగా 1,000 ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లకు, 8 స్థానిక లాంజ్‌లకు యాక్సెస్ మంజూరు చేస్తుంది. ఈ కార్డును విదేశాలలో ఉపయోగించినప్పుడు, ఈ కార్డ్‌కు కేవలం 2.50 శాతం విదేశీ కరెన్సీ మార్కప్ ఛార్జీ, అన్ని పెట్రోల్ పంపుల వద్ద 1% సర్‌ఛార్జ్ రాయితీ, విమాన రద్దు మరియు విమాన ప్రమాద బీమాను అందుకుంటారు. ఇంకా వార్షిక ధర రూ. 2999 + GST ఉంటుంది .