SBI Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్, వడ్డీ రేట్లు పెరిగాయి.
భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ అయిన SBI వడ్డీ రేట్లను పెంచి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
SBI Interest Rates : భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ అయిన SBI కొన్ని రోజుల క్రితం అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లను పెంచి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రుణ వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఈ బ్యాంకు నుంచి రుణం తీసుకున్న కస్టమర్లపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. మీరు తాజా రుణాన్ని పొందాలనుకున్నప్పటికీ, మీరు భారీ వడ్డీ రేట్లను ఆశించవచ్చు.
SBI నిధుల ఆధారిత రుణ రేట్ల మార్జినల్ కాస్ట్‌ను పెంచింది. కానీ ఇది ఇక్కడితో ఆగలేదు. రుణ వడ్డీ రేట్లు పెరుగుతాయని మరోసారి చెప్పుకొచ్చింది. ఈ అంచనా ఖాతాదారులకు మళ్ళీ షాక్‌కు గురి చేయవచ్చు.
మరోసారి రుణాలపై వడ్డీ రేట్లు 10 నుంచి 15 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సర్దుబాటు కార్పొరేట్ రుణాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.ఇతర రుణగ్రహీతలపై కూడా ప్రభావం ఉండవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది.
అయితే, SBI రుణ వడ్డీ రేట్లను పెంచడం గమనార్హం. ఆర్బీఐ తజాగా పాలసీ సమీక్షలో గవర్నర్ శక్తికాంత దాస్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులు తమ క్రెడిట్ మరియు డిపాజిట్ వృద్ధి రేట్ల మధ్య అసమానతను మళ్ళీ పరిశీలించాలన్నారు.
ఫిబ్రవరి 2023 నుండి, రెపో రేటు గరిష్టంగా 6.50 శాతంగా ఉంటుంది. ఈ క్రమంలో, డిపాజిట్ రేట్లు మారవచ్చు, మారకపోవచ్చని ఎస్బీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. రుణ రేట్లు మారవచ్చని ఆయన హై లైట్ చేసి చెప్పారు. ఎంసీఎల్ఆర్ రేటు మరో 10 నుంచి 15 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
SBI నుండి రుణం తీసుకునే వారికి వడ్డీ రేట్లు పెరగవచ్చని తెలుస్తుంది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు లేదా విద్యా రుణాలు కోరుకునే వారిపై ఇది అధిక ప్రభావాన్ని చూపుతుందని తెలుస్తుంది.
జూన్ 15న ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచింది. అన్ని రుణాల కాలపరిమితిపై రుణ రేట్లు పెరిగాయి. సంవత్సరానికి MCLR 8.65 శాతం నుండి 8.75 శాతానికి 10 బేసిస్ పాయింట్లు పెరిగింది. వడ్డీ రేట్లు మళ్లీ పెరిగితే, ఖాతాదారులు అధిక వడ్డీ రేట్లను ఎదుర్కొంటారు. దాంతో EMI కూడా పెరుగుతుంది. RBI రెపో రేట్లను పెంచవచ్చు.ఇది రుణ MCLR రేట్ల పెరుగుదలకు దోహదపడవచ్చు.
Comments are closed.