SBI PPF Scheme: కేవలం రూ.266 ఇన్వెస్ట్ చేస్తే, రూ.25 లక్షలు మీ సొంతం
ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ (PPF)ని ప్రారంభించింది. ఇక పూతి వివరాల్లోకి వెళ్తే.
SBI PPF Scheme: భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి డబ్బు పెట్టుబడి అవసరం. అయితే, పెట్టుబడి విషయానికి వస్తే చాలా మంది రిస్క్‌కి దూరంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ డబ్బును ఆర్థిక స్థిరత్వం మరియు అధిక రాబడి వచ్చే దాంట్లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు.
ప్రభుత్వ రంగానికి సంబంధించిన స్కీమ్స్ (Government Related Scheme) లో పెట్టుబడి పెట్టడం వలన మీకు నమ్మకమైన రాబడిని పొందవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే, మీరు SBI యొక్క PPF స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. రోజుకు రూ.266 పెట్టుబడి పెడితే, మీరు 25 లక్షలు అందుకోవచ్చు.
ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ (Public Sector Bank) , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ (PPF)ని ప్రారంభించింది. మీరు ఈ స్కీంలో పెట్టుబడి పెడితే, అధిక లాభాలను పొందవచ్చు. పెట్టుబడికి 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకానికి 15 ఏళ్ల పెట్టుబడి అవసరం. ఆ తర్వాత కూడా ఐదేళ్ల వ్యవధిలో పెంచుకోవచ్చు. ఎవరైనా వ్యక్తి లేదా మైనర్ పేరు మీద ఖాతాలు తెరిచి పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థ వార్షిక డిపాజిట్ (Annual Deposit) కనీసం రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు ఉంటుంది. బ్యాంకులు కాకుండా, మీరు పోస్టాఫీసు (Post Office) లో కూడా PPF ఖాతాను తెరవవచ్చు. మనకి ఎన్ని సార్లు అవసరం అయితే అన్ని సార్లు డిపాజిట్ చేసుకోవచ్చు.
Also Read:Changes From June 1st: జూన్ 1 నుండి కొత్త మార్పులు, అన్ని వివరాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
ఏదైనా అవసరం వచ్చినప్పుడు మధ్యలోనే డబ్బును విత్ డ్రా (WithDraw) చేసుకోవచ్చు. అయితే, 5 సంవత్సరాల తర్వాత 50% వరకు విత్ డ్రా (WithDraw) చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మరణం సంభవిస్తే అసలు మరియు వడ్డీ ని కలిపి ఈ స్కీం అందిస్తుంది.
ఈ స్కీంలో , మీరు నెలకి రూ. 8000 పెట్టుబడి పెడితే, అద్భుతమైన లాభాలను అందుకుంటారు. అంటే, రోజుకు 266 ఆదా చేస్తే, మీరు మెచ్యూరిటీ (Maturity) సమయానికి 25 లక్షలను అందుకోవచ్చు. ఉదాహరణకు. ఒక వ్యక్తి నెలకు రూ. 8000 పెట్టుబడి పెడతారనుకోండి, ఒక సంవత్సరంలో మొత్తం రూ. 96,000 అవుతుంది. 15 సంవత్సరాలలో మొత్తం డిపాజిట్ రూ.14,40,000 అవుతుంది. ఈ డిపాజిట్ మొత్తానికి 7.1% వడ్డీని లభిస్తుంది. అంటే మొత్తం మీద రూ. 10,84,544 వడ్డీ అందుతుంది. మెచ్యూరిటీ వ్యవధిలో మొత్తం మరియు వడ్డీతో కలిపి 25,24,544 అందుకుంటారు.
Comments are closed.