Telugu Mirror : కేరళ రాష్ట్రము లో వరుసగా పేలుళ్లు సంభవిచాయి. ఎర్నాకుళం లో ఉన్న కన్వెన్షన్ సెంటర్ లో మూడు పేలుళ్లు సంభవించాయి. జరిగిన ఈ పేలుడు ఫటనలో ఒకరు మరణించగా మరో 36 మందికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సుమారు 2000 మంది ప్రార్ధనలో పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రతి 5 నిమిషాలకు వేర్వేరు పేలుళ్లు జరిగాయి. రాత్రి 9:45 PMకి ప్రార్ధనలు ముగిసాయని ఈలోపే ఈ పేలుడు సంభవించిందని యెహోవా సాక్షుల సంస్థ ప్రతినిధి అయినా టిఏ శ్రీకుమార్ తెలియజేసారు. కొన్ని క్షణాల వ్యవధిలోనే హాల్ కి రెండు వైపులా మరో రెండు పేలుళ్లు సంభవించాయని చెప్పారు. ఆ ప్రాంతం చుట్టూ పక్కల యూదు వర్గానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు.
Also Read : పునీత్ రాజ్ కుమార్ మరణించి నేటికి రెండేళ్లు, ఆయన జ్ఞాపకాలతో కన్నడ ఇండస్ట్రీ అభిమానులు
కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ ఇది బాంబు పేలుడు అని స్పష్టంగా చెప్పగా 8 ప్రత్యేక బృందాలను పంపి ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
Blast at a convention center in Kalamassery, Kerala.
– Blast took place at a prayer meeting of Jehovah's Witnesses.
– Till now, one killed & several injured.
– The cause of the blast is not known yet. Teams of the NSG & NIA are being sent to Kerala. pic.twitter.com/lQfMc9DTzI
— Anshul Saxena (@AskAnshul) October 29, 2023
ఇంతకీ ఏం జరిగింది :
కలమెస్సరి అనే ప్రాంతంలో యెహోవా కన్వెన్షన్ సెంటర్ ఉంది. ఆదివారం కావడం తో దేవున్నీ ప్రార్ధించడానికి ప్రజలు కన్వెన్షన్ సెంటర్ కి వెళ్లారు. ప్రార్థనలు ప్రారంభమయిన కొంత సమయానికి 5 నిమిషాల వ్యవధిలో పేలుళ్లు సంభవించాయి. అయితే ఇందులో మొదటి పేలుడు బిగ్గరగా వచ్చింది. సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్న తర్వాత ఒక మృత దేహాన్ని చూసారు, వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సెంటర్ లో యెహోవా విట్ నెస్ రీజనల్ ప్రోగ్రామ్ మూడు రోజులుగా జరుగుతుంది ఇది చివరి రోజు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఒక టిఫిన్ బాక్స్ లో ఐఈడి డివైస్ ని పెట్టినట్లు డీజీపీ తెలిపారు.
Also Read : భారత్ లో టాటా గ్రూప్స్ నుండి ఐఫోన్స్ తయారీ, చరిత్ర సృష్టించడానికి టాటా రెడీ
పేలుళ్లు ఎలా జరిగాయి ?
పేలుళ్లు సంభవించిన వెంటనే హోమ్ మంత్రి , మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ జరిగిన ఘటనకు పూర్తి వివరాలు మరియు కారణాలు తెలుసుకోవాలి NIA ,IB బృందాలకు ఆదేశాలను జారీ చేసారు. పేలుళ్ల వెనుక ఉన్న కారణాలపై ఎటువంటి స్పష్టత లేదు. కేరళ సీఎం పినరయి విజయన్ ఢిల్లీ లోని నిరసనలో ఉన్నారు. పేలుళ్లు జరగడం దురదృష్టమని , అతను డీజీపీతో మాట్లాడి తాజా సమాచారాన్ని తెలుసుకున్నారు.