Sim Card Details: మీ పేరు పై ఎన్ని సిమ్ కార్డులు యాక్టీవ్ గా ఉన్నాయో తెలుసా? ప్రాసెస్ ఇదే!
మీ పేరులో ఎన్ని సిమ్ కార్డ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో అని తెలుసుకోవడం ఎలానో తెలుసా? ఈ ప్రాసెస్ తో వెంటనే తెలుసుకోండి.
Sim Card Details: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటూనే ఉంటుంది. ఫోన్ ఉంటే ఖచ్చితంగా సిమ్ ఉండాలి. కొత్తగా వచ్చే స్మార్ట్ ఫోన్లలో.. డ్యూయల్ సిమ్ ఆప్షన్ (Sim Option) అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ రెండు సిమ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సిమ్ కార్డులతో నేరాలకు కూడా పాల్పడుతున్నారు. కొందరు మోసగాళ్లు మనకు తెలియకుండా మన పేర్లతో సిమ్ కార్డులు పొందుతున్నారు.
సాంకేతిక అభివృద్ధి పెరుగుతున్న కొద్దీ. సైబర్ నేరాలు (Cyber Crimes) కూడా విపరీతంగా పెరిగాయి. కాబట్టి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో తెలుసుకోవడం కోసం, మీరు మీ ఫోన్, SIM కార్డ్, బ్యాంక్ సమాచారం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
అయితే, సైబర్ స్కామ్‌లలో ఎక్కువ భాగం ఫోన్ నంబర్‌లను ఉపయోగిస్తారు. వారు ఫోన్ నంబర్‌లను మార్చి లేదా వారి ఓకే గుర్తింపు కార్డుపై అనేక సిమ్ కార్డ్‌లను తీసుకొని నేరాలకు పాల్పడతారు. ఈ సందర్భంలో, ఎవరైనా మీ ఆధార్ (Aadhar) ని ఉపయోగించి మరొక నంబర్‌ని యాక్టివేట్ చేశారని మీరు అనిపిస్తే, వెంటనే కన్ఫార్మ్ చేసుకోవాలి. మోసాన్ని నివారించడానికి మీ ఆధార్‌లో ఎన్ని SIM కార్డ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో చెక్ చేసుకోండి.
మీ పేరులో ఎన్ని సిమ్ కార్డ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో అని తెలుసుకోవడం ఎలానో తెలుసా? ఒకే IDతో 9 సిమ్ కార్డులు పొందవచ్చు. మీ పేరులో ఎన్ని SIM కార్డ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ వివరాలు తెలుసుకుందాం.
Also Read: Jio Super Recharge Plan: జియో నుండి సూపర్ రీఛార్జ్ ప్లాన్, ఇక ఏడాదంతా దిగులు పడాల్సిన పని లేదు!
ముందుగా, tafcop.sancharsaathi.gov.inలో TAFCOP సైట్‌ని సందర్శించండి.
ఆ తర్వాత, పేజీలో కనిపించే బాక్స్ లో మీ సెల్‌ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి.
మీ ఫోన్ నంబర్‌కు వెంటనే OTP వస్తుంది. దాన్ని నమోదు చేసి లాగిన్ చేయండి.
ఆ తర్వాత, మీ ID నుండి యాక్టివ్ ఫోన్ (Active Phone) నంబర్‌లు స్క్రీన్ పై కనిపిస్తాయి.
అందులో మీకు సంబంధించిన ఫోన్ నంబర్ లేకుంటే, దానిని మీరు పిర్యాదు చేయండి. అలా చేస్తే, మీ నంబర్ ఆధార్ కార్డ్ నుండి తొలిగిస్తారు.
TAFCOP సైట్‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నిర్వహిస్తుంది. ఈ పేజీ మొబైల్ కనెక్షన్‌ల సమాచారాన్ని అందిస్తుంది. మీ ఆధార్ కార్డుతో ఎన్ని మొబైల్ నంబర్లు నమోదు చేశారు? ప్రస్తుతం, యాక్టివ్‌గా ఉన్న నంబర్‌లు ఉన్నాయి? అనే విషయాల గురించి తెలుసుకోవచ్చు. మీకు తెలియకుండా ఎవరైనా మీ SIM మరియు IDని ఉపయోగిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవచ్చు. మీ ఐడీలోని సిమ్ కార్డును ఉపయోగించి ఏదైనా నేరం జరిగితే దానికి మీరే బాధ్యులని గుర్తుంచుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments are closed.