Sim Cards : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉందనడంలో సందేహం లేదు. ఇప్పుడు డ్యూయల్ సిమ్ ఆప్షన్ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ రెండు సిమ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు ఈ సిమ్ కార్డులతో నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు దొంగలు మనకు తెలియకుండా మన పేర్లతో సిమ్ కార్డులు పొందుతున్నారు.
మరి మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు యాక్టివేట్ అయ్యాయో తెలుసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా? అధికారుల ప్రకారం, సాధారణంగా ఒకే ఐడితో 9 సిమ్ కార్డులను పొందవచ్చు. మీ పేరులో ఎన్ని SIM కార్డ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవడానికి దిగువ పేర్కొన్న దశలను అనుసరించండి.
- ముందుగా TAFCOP పోర్టల్ tafcop.sancharsaathi.gov.inకి వెళ్లండి.
- ఆ తర్వాత, పేజీలో కనిపించే బాక్సులో మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- మీ ఫోన్ నంబర్‌కు తక్షణమే OTP జారీ చేయబడుతుంది. దాన్ని నమోదు చేసి లాగిన్ చేయండి.
- అనంతరం స్క్రీన్‌పై మీ ఐడీ నుంచి యాక్టివ్‌లో ఉన్న ఫోన్ నెంబర్లకు కనిపిస్తాయి.
- మీకు సంబంధించిన నంబర్ ఏదీ లేకుంటే, అది మీది కాదని మీరు నివేదించాలి. మీరు ఇలా చేస్తే, మీ నంబర్ ఆధార్ కార్డ్ నుండి తీసివేయబడుతుంది.
TAFCOP పోర్టల్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నిర్వహిస్తుంది. ఈ పోర్టల్ మొబైల్ కనెక్షన్ల సమాచారాన్ని అందిస్తుంది. మీ ఆధార్ కార్డుతో ఎన్ని మొబైల్ నంబర్లు నమోదు చేయబడ్డాయి? ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న నంబర్‌లను మీరు కనుగొనవచ్చు.
మీకు తెలియకుండా ఎవరైనా మీ SIM మరియు IDని ఉపయోగిస్తున్నట్లయితే ఈ పద్ధతి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ఐడిపై ఉన్న సిమ్ కార్డు నుంచి ఏదైనా నేరం జరిగితే దానికి మీరే బాధ్యులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులు చెబుతున్నారు.