Singareni Recruitment, Useful Information : నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో 327 ఉద్యోగాలు.. ఇదిగో నోటిఫికేషన్!

Singareni Recruitment

Singareni Recruitment : తెలంగాణ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SSCL).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌/ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో 327 ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు మే 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. జూన్‌ 4 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను  లో చెక్‌ చేసుకోవచ్చు.

ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారంvఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఈఅండ్‌ఎం, సిస్టమ్స్)-49 పోస్టులు, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ-100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్, ఎలక్ట్రికల్)-33 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1లో 47 పోస్టులు, ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీలో 98 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి మే 4న సాయంత్రం 5 గంటల్లోపు  ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చని సింగరేణి యాజమాన్యం సూచించింది.

Singareni Recruitment

పోస్ట్ ల వివరాలు :

1. ఎగ్జిక్యూటివ్ కేడర్ – 49.

మేనేజ్‌మెంట్ ట్రైనీ (E&M), E2 గ్రేడ్ : 42 పోస్టులు
మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), E2 గ్రేడ్ : 7 పోస్టులు

2. నాన్ ఎగ్జిక్యూటివ్ (NCWA) కేడర్ – 278

జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ (JMET), T&S గ్రేడ్-C : 100 స్థానాలు
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్), T&S గ్రేడ్-సి : 9 పోస్టులు
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్), T&S గ్రేడ్-సి : 24 పోస్టులు.
ఫిట్టర్ ట్రైనీ, క్యాట్-I : 47 పోస్టులు
ఎలక్ట్రీషియన్ ట్రైనీ, క్యాట్-I : 98 పోస్టులు

అర్హత : తగిన విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి : 30 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల అభ్యర్థులు ఐదేళ్ల సడలింపుకు అర్హులు.
ఎలా దరఖాస్తు చేయాలి: మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : మే 15, 2024.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 4, 2024.

Singareni Recruitment

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in