Sitara Ghattamaneni : మహేష్ బాబు గారాల పట్టి సితార..ఎక్కడ చదువుతుందో తెలుసా?
సితారను ఒక ప్రముఖ ఆభరణాల సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా పేర్కొంది. సితార కట్టుకున్న చీర మరియు నగలు ధరించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి.
Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నతనంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది, తన హాలిడే ఫోటోలు మరియు డ్యాన్స్ వీడియోలతో అందరినీ అలరిస్తుంది.
సితార తన సొంత ఇమేజ్‌ని నిర్మించుకుంది, సితార చిన్న వయసులోనే అధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను కలిగి ఉండటం అంత చిన్న విషయం కాదనే చెప్పాలి. ఈ బ్యూటీ తన తండ్రి మహేష్ బాబుతో సర్కార్ వారి పాట చిత్రంలో మాస్ స్టెప్పులు వేసి తనకంటూ ఒక ముద్ర వేసుకుంది.
అంతే కాకుండా, సితారను ఒక ప్రముఖ ఆభరణాల సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా పేర్కొంది. సితార కట్టుకున్న చీర మరియు నగలు ధరించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసి ప్రజలు కూడా బాగా చూడముచ్చటగా ఉందని, జనాలు కూడా ఎంటర్టైన్ అవుతున్నారు.
అయితే, తాజాగా అందాల సితార గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సితార ఏ స్కూల్లో చదువుతుందా? అనే ప్రశ్న అందరికీ వచ్చే ఉంటుంది.
తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన నమ్రత, మహేష్ బాబులను ఓ ప్రశ్న అడిగారు. సితార హైదరాబాద్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. ఇక సితార సినిమా ప్రవేశం ఎప్పుడని ప్రశ్నించగా…ఇంకా చాలా సమయం ఉందని చెప్పారు. సితారా హైట్ ఎక్కువగా ఉన్నప్పటికీ తన వయస్సు లో మాత్రం చాలా చిన్నది అని నెటిజన్లు చెబుతున్నారు. చిన్న వయస్సులోనే తన మంచితనాన్ని సంపాదించుకుంది.
Comments are closed.