Telugu Mirror : తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు. ఈ యంగ్ హీరోలు తమ ప్రతి సినిమా సినిమాకి అంచలంచలుగా ఎదిగి తమ సత్తాను చాటుతున్నారు. అందులో టీనేజ్ వయస్సు నుండే తన సత్తా చాటుతూ ప్రజాదరణ పొందిన ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ఒకరు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈ మధ్య కాలంలో రామ్ నటించిన సినిమాలు పెద్దగా హిట్ లు సాధించలేకపోయాయి. ఈసారి మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న రామ్ స్కంద మూవీ మంచి హిట్ ని తెచ్చి పెడుతుందని భారీ అంచనాలు వేశారు.
బోయపాటి శ్రీను దర్శకత్వం లో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన ఈ స్కంద మూవీ మిక్సడ్ టాక్ వచ్చినప్పటికీ ప్రజల నుండి మంచి రెస్పాన్స్ ఉండడంతో ఓపెనింగ్స్ ఒక రేంజ్ లో లభించాయి. కానీ ఇక రెండో రోజు నుండి ఈ సినిమా డౌన్ అవుతూ వచ్చింది. వారం రోజుల్లోనే చాలా థియేటర్స్ ని కోల్పోయిన రామ్ సినిమా నష్టాలతో ముగింపు పలికింది. ప్రస్తుతం, ఈ సినిమా ఇప్పుడు OTT లో సందడి చేయడానికి సిద్దమవుతుంది. ఈ సినిమా రెండు గంటల 47 నిమిషాలు రన్ టైంని కలిగి ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ ,లవ్ ట్రాక్ మరియు ఫ్యామిలీ డ్రామాతో కూడిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తమిళ్, హిందీ , కన్నడ , మలయాళం వంటి భాషల్లో విడుదలయింది.
మాస్ కాంబినేషన్ లో తీసిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ (Disney Plus Hotstar) భారీ స్థాయిలో కొనుగోలు చేసింది. ఈ సినిమా డీలింగ్ సమయంలోనే సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన 4 వారాల తర్వాత మాత్రమే OTTలో రిలీజ్ చేయాలని ఒప్పందాలు జరుపుకున్నారట. స్కంద మూవీ సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలయింది. నాలుగు వారాల తర్వాత అంటే అక్టోబర్ 27న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఐటమ్ సాంగ్ లో హల్ చల్ చేసారు. బోయపాటి శ్రీను మరియు రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ను శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమార్ నిర్మాతలుగా వహించారు.
ముద్దుగుమ్మ శ్రీలీలతో పాటు సయీ మంజ్రేకర్ కూడా కీల పాత్ర పొందించారు. శ్రీకాంత్, ఇంద్రజ మరియు శరత్ లోహితాశ్వ తదితరులు ఈ సినిమా లో నటించారు. దీనికి థమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా దాదాపు రూ .50 కోట్ల వసూళ్లను సాధించింది. స్కంద సినిమా తర్వాత రామ్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా తీస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.