చలికాలంలో ప్రతి ఒక్కరి చర్మం పొడి బారుతూ ఉంటుంది. దీనికి కారణం వాతావరణం లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి ఎక్కువగా ఉండటం వల్ల చర్మం పగిలిపోతూ (bursting) ఉంటుంది. అలాగే దురద వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.
కాబట్టి శీతాకాలం (winter) లో చర్మం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కేవలం చర్మంపై క్రీములు రాయడం కన్నా సరైన ఆహారం తీసుకోవడం వల్ల చర్మం లోపల నుండి హైడ్రేట్ అవుతుంది.
చలికాలంలో వచ్చే డ్రై స్కిన్ సమస్యలను తొలగించుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా డ్రై స్కిన్ ను తొలగించుకోవచ్చు.
చలికాలంలో వచ్చే చర్మ సమస్యలను తొలగించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
పోషకాహారం :
శీతాకాలంలో పోషకాలు (Nutrients) ఉన్న ఆహారాన్ని మరియు శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనగా బెల్లం, కొబ్బరి, నెయ్యి, నువ్వులు ఇటువంటి ఆహార పదార్థాలను ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి.
Also Read : Benefits Of Rose Water : రోజ్ వాటర్ ని ఇలా ఉపయోగిస్తే గులాబీ లాంటి అందం మీ స్వంతం
ఆయిల్ మసాజ్ :
చలికాలం మొదలైంది. ప్రారంభం నుండే చర్మం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. స్నానానికి ముందు శరీరం మొత్తాన్ని ఏదైనా నూనెతో మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ (blood Circulation) బాగా జరిగి చర్మానికి తేమను అందించి చర్మం ను కాంతివంతంగా చేస్తుంది.
నిద్ర :
మానవునికి నిద్ర చాలా ముఖ్యం. ప్రతిరోజు ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. నిద్ర వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. అలాగే నిద్ర చర్మాన్ని అందంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
Also Read : JADE ROLLER MASSAGER : మిడిల్ ఏజ్ లో కూడా టీనేజ్ లా మెరవాలంటే. ఉపయోగించండి, తేడా గమనించండి
నీరు :
చలికాలంలో చాలామంది నీటిని తక్కువగా తాగుతుంటారు. ఏ కాలంలో నైనా ప్రతిరోజు 8 గ్లాసుల నీరు త్రాగాలి. నీరు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతాయి. అలాగే తాగే నీటిలో అల్లం, దాల్చిన చెక్క, మరియు యాలకులు వంటివి వేసి మరిగించి ఈ నీటిని గోరువెచ్చ (warm) గా తాగి నట్లయితే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరానికి కావలసినంత నీటిని అందించడం వల్ల చర్మం తేమను కోల్పోకుండా ఉంటుంది.
మైల్డ్ సోప్ :
చలికాలంలో గాఢత (concentration) ఎక్కువగా ఉన్న సబ్బులను వాడకూడదు. వీటివల్ల చర్మం మరింత డ్రై గా మారుతుంది. కాబట్టి మైల్డ్ సోప్ ని మాత్రమే వాడాలి. దీనివల్ల చర్మం తేమగా ఉంటుంది. అలాగే శరీరం ఎప్పుడూ వేడిగా ఉండేలా చూసుకోవాలి.
చలి నుండి శరీరాన్ని కాపాడుకోవడం కోసం స్వెట్టర్ లు, స్కార్ఫ్ లు వంటివి వాడాలి.
కాబట్టి చలికాలంలో చర్మం డ్రై అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.