Small Business Ideas: వ్యాపారం చేయాలని చాలామంది అనుకుంటారు. సొంత కాళ్ళ మీద నిలబడి మంచి వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ, పెట్టుబడి పెట్టలేకనో, నష్టం వస్తుందేమో అనే భయంతోనో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. మరి, తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించే కొన్ని వ్యాపారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యూటీ పార్లర్
ఆడవారు ఎక్కువగా అందానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజుల్లో బ్యూటీ పార్లర్ కి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. పెళ్లిళ్ల వంటి పెద్ద పెద్ద శుభకార్యాలకే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా మేక్ అప్ వేసుకుంటున్నారు. మేక్ అప్ ఆర్టిస్ట్ దగ్గర నేర్చుకొని సొంతంగా వ్యాపారం ప్రారంభించుకుంటే మంచి లాభాలు వస్తాయి. దీనికి ఎక్కువ డబ్బు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
టీ స్టాల్ బిజినెస్
ఎక్కువగా పని చేసే వారు కాస్త రిలీఫ్ పొందడం కోసం టీ ను తాగుతూ ఉంటారు. జనాలు ఎక్కువగా తిరిగే చోట టీ స్టాల్స్ పెట్టుకుంటే లాభాలు ఎక్కువగా వస్తాయి. ఈ బిజినెస్ కాలంతో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి టీ స్టాల్ బిజినెస్ కూడా మంచిదే. దీనికి పెట్టుబడి కూడా ఎక్కువగా అవసరం ఉండదు.
పచ్చళ్ళ వ్యాపారం
పచ్చళ్ళు తయారు చేసి కూడా అమ్ముకుంటే మంచి లాభాలు వస్తాయి. ఇన్స్టంట్ పచ్చళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. తక్కువ పెట్టుబడితో పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. వివిధ రకాలతో కూడిన రుచిరకమైన పచ్చళ్ళు తయారు చేసి అమ్మితో అధిక లాభాలు వస్తాయి. ఎండాకాలంలో పచ్చళ్ళ విక్రయం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అమ్ముకుంటే లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
యూట్యూబ్ ఛానల్
యూట్యూబ్ ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. యూట్యూబ్ ఛానల్ వల్ల ఎంతో మంది ఎన్నో వీడియోలు చేసుకుకొని డబ్బు సంపాదించడం మనం చూస్తూనే ఉన్నాం. మంచి కంటెంట్ ని ఎంచుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనిపై కూడా మంచి లాభాలు పొందవచ్చు.
టిఫిన్స్ బిజినెస్
ఇక టిఫిన్స్ బిజినెస్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా టిఫిన్స్ పెట్టుకుంటే అధిక లాభాలు మీ వద్దకు వస్తాయి. ఎక్కువ జనాలు తిరిగే ప్రదేశం ఎంచుకొని టిఫిన్స్ పెట్టుకుంటే అధిక లాభాలు వస్తాయి. తక్కువలో తక్కువగా పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించండి.
Small Business Ideas