Snake in shoe : ఆదమరిస్తే అంతే సంగతులు.. వర్షాకాలం లో కొంచెం జాగ్రత్త బాస్.
ఒక వ్యక్తి తన షూస్ ను వేసుకుందామని చూశాడు. ఇంతలో ఏదో తోక కన్పించింది. వెంటనే చూస్తే ఒక పాము కన్పించింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Snake in shoe : అసలే వర్షాకాలం, పైగా బిజీ లైఫ్ షెడ్యూల్. ఓ వైపు స్కూళ్లకు వెళ్లే పిల్లలు, మరోవైపు ఉద్యోగాలకు బయలు దేరే పెద్దలు పొద్దున్న లేచినప్పటి నుంచి తమ తమ పనుల్లో మునిగిపోతారు. ఇక బయలు దేరాల్సిన సమయం అయిందనే తొందరలో కొందరు చెప్పులు, షూలను సరిగ్గా చూడకుండానే వేసుకొని వెళ్తుంటారు. కానీ ఇది కొన్నిసార్లు ప్రమాదం కావచ్చు. ఎందుకంటే షూలలో కీటకాలు, తేళ్లు, పాములు వంటివి చేరి ఉండవచ్చు.
వర్షాకాలంలో పాములు ఎక్కువగా బైట కన్పిస్తుంటాయి. అవి మన ఇళ్లలోనికి ప్రవేశిస్తుంటాయి. వర్షం వల్ల బైట వాతావరణం అంతా చల్లగా ఉంటుంది. దీంతో అవి వెచ్చగా ఉంటాయని మన ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. బట్టలలో, కిటికీలు, బీరువాలలో పాములు కన్పిస్తు ఉంటాయి.
ఇటీవల పాములు హెల్మెట్ లలో కూడా దూరిపోయి కూర్చుని ఉంటున్నాయి. స్కూటీ డిక్కీలో, కారులోని బంపర్ లలో కూడా దాక్కుని ఉంటున్నాయి. కారు సీటు కింద కూడా పాములు కన్పిస్తున్నాయి. చాలా మంది పాములను కన్పించగానే ఆపద కల్గించడానికి ఇష్టపడరు. కొందరు పాములను పట్టేవారికి సమాచారం ఇస్తారు. కొన్నిసార్లు పాములు కాటు వేస్తుంటాయి.
నీరజ్ ప్రజాపత్ అనే స్నేక్‌క్యాచర్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో, అతను షూ లోపల నుండి నాగుపామును బయటకు తీస్తున్నాడు. షూ రాక్‌లో వరుసగా షూలు పేర్చి ఉండగా,వాటిలోని ఒక షూలోపల భారీ నాగుపాము నక్కిఉంది. అది గమనించిన ఆ ఇంటి యాజమాని స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా, అతను పాము పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
అతడు షులో కర్రను చొప్పించిన వెంటనే ఆ పాము కోపంతో పడగ విప్పి పైకి లేచింది. ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. వీడియోలో విష సర్పం చాలా భయానకంగా పడగవిప్పి బుసలు కొడుతుంది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్‌లో ఇలా రాశారు.. వర్షాకాలంలో మీ బూట్లను ఎప్పుడూ చెక్ చేసుకోండి. అని సూచించారు.
ఇక వానాకాలంలో పాముల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని సూచనలు తప్పక పాటించాలి. ముందు, ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకోకుండా జాగ్రత్త పడాలి. ఇంటి పరిసరాల్లో గడ్డి కూడా ఎత్తుగా పెరగకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాల్లో ఏవైనా గొయ్యలు ఉంటే వాటిని ఆలస్యం చేయకుండా పూడ్చేయాలి.
పాములను ఆకర్షించే కప్పలు, ఎలుకలు ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి. ఇక పాము కనిపిస్తే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయకుండా పాములు పట్టుకునే వారికి సమాచారం అందించాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే వానాకాలంలో పాముల బారిన పడే అవకాశాలు చాలా వరకూ తగ్గిపోతాయి.
Snake in shoe
Also Read : Telangana Heavy Rains : తెలంగాణలో దంచి కొడుతున్న వానలు.. రెడ్ అలర్ట్ జారీచేసిన ప్రబుత్వం.
Comments are closed.