గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ తో జుట్టుకి కలిగే బోలెడు ప్రయోజనాలు ఏంటో తెలుసా

Telugu Mirror : ద్రాక్షపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని మన అందరికి తెలుసు. కానీ ద్రాక్షపండు (Grapefruit) జుట్టు సంరక్షిస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు. ద్రాక్షపండు తీపి, రిఫ్రెష్, కాంతి, సిట్రస్ సువాసన శరీరాన్ని, మనస్సు ను, జుట్టుని మరియు చర్మాన్ని తక్షణమే రిఫ్రెష్ చేస్తుంది. ఇది అనేక వైద్యపరమైన ఉపయోగాలు కలిగిన యాంటీఆక్సిడెంట్-రిచ్ సిట్రస్ పండుగా పరిగణించబడుతుంది. సిట్రస్ ప్యారడిసి (Citrus paradisi) అనే లాటిన్ పదం నుండి వచ్చింది. రిఫ్రెష్ (Refresh) మరియు చురుదనాన్ని కలిగిస్తుంది. కోల్డ్ ప్రెస్డ్ గ్రేప్‌ ఫ్రూట్ పీల్ ఆయిల్ (Grape fruit Peel Oil) ప్రకాశవంతంగా మరియు నీటిలా ఉంటుంది. నూనెను తయారు చేసిన 6 నెలల లోపు ఉపయోగించాలి ఎందుకంటే దాని తర్వాత అందులో ఉండే పోషకాలు క్షీణిస్తాయి.

ద్రాక్షపండు నూనె వలన జుట్టుకి కలిగే ప్రయోజనాలు

Healthy Hair :

గ్రేప్‌ ఫ్రూట్ ఆయిల్ ని ఉపయోగించి మసాజ్ చేస్తే ఆరోగ్యకరమైన జుట్టును (Hair) పొందుతారు మరియు జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది మరియు కొత్త జుట్టును మొలిచేలా చేస్తుంది. ఇది జుట్టును మెరిసేలా కూడా చేస్తుంది.హెయిర్ మాస్క్ (Hair Mask) చేయడానికి తాజా ద్రాక్షపండు రసం లేదా నారింజ, నిమ్మ మరియు నూనె కలపండి. అర్ద గంట సేపు అలానే ఉంచండి. తర్వాత మీ జుట్టుని కడిగేయండి. ఇది జుట్టును శుభ్రపరుస్తుంది మరియు పునరుజ్జీవింపజేస్తుంది.

Hair Deodorant :

ఒక స్ప్రే (Spray) బాటిల్‌లో ద్రాక్షపండు నూనె మరియు కొద్దిగా నీరు వేయండి. మీ జుట్టుకి షాంపూ పెట్టి వాష్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మీ తలపై స్ప్రే (Spray) చేయండి. ఈ స్ప్రే జుట్టుకు తాజా సువాసనను ఇస్తుంది.

Also Read : Benefits OF Coriander Leaves : జుట్టు రాలడాన్ని, బట్టతలను అరికట్టే కొత్తిమీర

Hair Cleanser :

సులభంగా తయారు చేయగల ఈ క్లీనర్ జుట్టు నుండి మురికిని మరియు క్లోరిన్‌ను తొలగిస్తుంది. క్లెన్సర్ (Cleanser) తయారీలో ½ కప్ సాఫ్ట్ డ్రింక్ , ¼ కప్పు ద్రాక్షపండు రసం, ¼ కప్ నారింజ రసం, ¼ కప్పు నిమ్మరసం మరియు  మెరుపు కోసం 2 చుక్కల సేజ్ ఆయిల్ వేయాలి. వీటన్నిటినీ స్ప్రే బాటిల్‌లో వేసి కలపండి. తడి జుట్టు మీద మిశ్రమాన్ని స్ప్రే చేయండి. జుట్టును దువ్వి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత మీరు సాధారణంగా వాడే షాంపూ లేదా కండీషనర్ ఉపయోగించండి. పొడిగా , దెబ్బతిన్న జుట్టు కోసం ప్రతి రెండు వారాలు ఇలా చేస్తూ ఉండండి.

Image Ctredit : Treehugger

Fights Dandruff :

ద్రాక్షపండు నూనె చుండ్రుని తొలగించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మీ షాంపూ (Shampoo) బాటిల్‌లో కొన్ని చుక్కల గ్రేప్‌ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్ కలపడం వల్ల మీ జుట్టు మెరుస్తుంది.

Hair Detangler :

మీ జుట్టుపై 2-3 చుక్కల గ్రేప్‌ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్, రెండు చుక్కల గ్లిజరిన్, ఒక టీస్పూన్ అలోవెరా జెల్ మరియు అర లీటరు నీటిని స్ప్రే చేయడం వలన జుట్టుకి పడే చిక్కులను తగ్గించవచ్చు.

Also Read : నేడే ప్రపంచ ఆహార దినోత్సవం, వృథాను అరికడదాం నిరుపేదల కడుపు నింపుదాం

Hair Removal :

హెయిర్‌స్ప్రే, జెల్‌లు మరియు జుట్టు కుదుళ్లను నాశనం చేసే క్రీమ్ వంటి పదార్థాలను తొలగిస్తుంది. ద్రాక్షపండు రసాన్ని జుట్టుకు మసాజ్ చేసి శుభ్రం చేసుకోండి. సహజమైన వాటిలో హాని లేకుండా జుట్టు మృదువుగా మరియు సిల్కీగా ఉంచేలా చేస్తుంది.

గమనిక : ఈ చికిత్సను ఉపయోగించే ముందు నిపుణుడిని సంప్రదించగలరు.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in