Soaked Dry Fruits : ప్రతి రోజూ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మీ గుండె పదిలం.. శారీరక ఆరోగ్యం ధృడం
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు కథనంలో వాల్ నట్స్, బాదం, పల్లీలు ఈ మూడింటి లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ మూడింటిని నానబెట్టి తినవచ్చా లేదా అనే విషయం తెలుసుకుందాం.
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఉన్నాయి. అందుకే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈరోజు కథనంలో వాల్ నట్స్, బాదం, పల్లీలు ఈ మూడింటి లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ మూడింటిని నానబెట్టి తినవచ్చా లేదా అనే విషయం తెలుసుకుందాం.
వేరు శనగలు :
వేరుశెనగ లలో ఫైబర్, క్యాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా వీటిల్లో పిండి పదార్థాలు మరియు కొవ్వు కూడా ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరానికి శక్తిని మరియు ఆరోగ్యకరమైన కొవ్వును (Healthy fat) అందిస్తాయి.
బాదం :
బాదం (almond) లో ప్రోటీన్, మెగ్నీషియం, ఫైబర్, మాంగనీస్, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి.
Also Read : Benefits Of Wall Nuts : చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను అందించే వాల్ నట్స్ ని ఇలా తినండి హెల్దీ గా ఉండండి
వాల్ నట్స్ :
వాల్ నట్స్ (wall nuts) లో మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఐరన్, క్యాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. ఇవే కాకుండా వాల్ నట్స్ లో ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ మరియు ఖనిజాలు (Minerals) కూడా ఉన్నాయి. వాల్ నట్స్ వల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది.
ప్రతిరోజు ఉదయం నానబెట్టిన బాదం, పల్లీలు, వాల్ నట్ లను ను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
సన్నగా ఉన్నవారు కండరాలు (muscles)పెంచాలి అనుకుంటే ఈ మూడింటిని కలిపి తినడం వల్ల కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. జిమ్ కి వెళ్లి వర్క్ అవుట్ లు చేసేవారు వీటిని తిని కండరాలను అభివృద్ధి చేసుకోవచ్చు.
ప్రతిరోజు నానబెట్టిన ఈ మూడు రకాల డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ (digestive system) బలంగా ఉంటుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే వీటిలో ఫైబర్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియ కు చాలా ప్రయోజనకారి గా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మూడింటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. ఈ మూడు కూడా గుండె (Heart) కు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Also Read : Dates Benefits : పోషకాల గని ఖర్జూర పండు. రోజూ రాత్రి రెండు ఖర్జూర మిమ్మల్ని ఎప్పటికీ ధృఢంగా ఉంచుతుంది.
ప్రతిరోజుఈ మూడు రకాల డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎముకలకు మేలు కలుగుతుంది. ఎముకలు (Bones) దృఢంగా ఉండడానికి సహాయపడతాయి. బాదం లో క్యాల్షియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. బాదం మరియు పల్లీలు నోటి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.
కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట నానబెట్టిన బాదం, వేరుశనగ (Peanut) లు, వాల్ నట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. తద్వారా ఎముకలు,కండరాలు దృఢంగా మారతాయి.అలాగే జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Comments are closed.