ఈ మధ్యకాలంలో చిన్నగా, మరియు అందంగా ఉండే హైటెక్ ఎయిర్ పాడ్ (Air pod) అందుబాటులోకి వచ్చాయి. ఖరీదైన ఇటువంటి ఎయిర్ పాడ్ కారణంగా ఓ మహిళ ఇబ్బంది పడిన సంఘటన చోటు చేసుకుంది. పొరపాటున విటమిన్ మాత్రకు (Vitamin Tablet) బదులుగా ఎయిర్ పాడ్ నోట్లో పెట్టుకొని మింగి, నీళ్లు (Water) తాగింది. దీనితో ఆమె ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
పిల్లలు (Kid’s) మింగడం సహజంగా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. మనం కూడా చాలా సార్లు వింటూ ఉంటాం. అసలు ఈ పొరపాటు ఎలా జరిగింది అనే విషయం వివరంగా తెలుసుకుందాం.
ఈ సంఘటన యూఎస్ఏ (USA) లోని ఉటాలో చోటు చేసుకుంది. యూఎస్ఏ లో ఉటా (vu ta) లో ఉంటున్న ఈమె మార్నింగ్ వాకింగ్ (Waking) కి వెళ్లింది. అయితే అంతకుముందు విటమిన్ టాబ్లెట్ వేసుకోవలసి ఉండగా, కొంచెం ఆలస్యం (Late) అయ్యింది. దీంతో హడావుడిగా వాటర్ బాటిల్, విటమిన్ టాబ్లెట్ తీసుకుని వాకింగ్ కి వెళ్ళింది. వీటితోపాటు ఆమె తన భర్త ఆపిల్ ఐఫోన్ ఎయిర్ పాడ్ (Apple iPhone Air pod) ను వెంట తీసుకుని వెళ్ళింది.
వాకింగ్ చేసేటప్పుడు ఆమెకు సంగీతం (Music) వినే అలవాటు ఉంది. అయితే ఈ క్రమంలో తన ఫ్రెండ్స్ ని కలిసి మాట్లాడుకుంటూ నడవడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాక విటమిన్ టాబ్లెట్ వేసుకోవాలని గుర్తుకు వచ్చింది. వెంటనే నడుస్తున్న చోటే ఆగి విటమిన్ టాబ్లెట్ ను తీసింది. తర్వాత తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ (Water bottle) తీసి ముందుగా నీళ్లు తాగింది. ఆ తర్వాత మాత్ర అనుకొని ఎయిర్ పాడ్ ను మింగేసింది. తర్వాత తన చేతిలో ఏదో ఉందని చూసుకుంది. చూస్తే విటమిన్ టాబ్లెట్ ఉంది. ఆమెకు ఒక్కసారిగా షాక్ (Shock) తగిలినంత పని అయింది. చేతిలో ట్యాబ్లెట్ పట్టుకొని భర్త ఎయిర్ పాడ్ మింగి నీళ్లు తాగినట్లుగా అర్థం చేసుకుంది.
ఇంతలో ఐఫోన్ రింగ్ టోన్ , మ్యూజిక్, పాట అన్ని ఆమె పొట్ట (Stomach) లోపల నుంచి వినపడడం మొదలయింది. అయితే ఎయిర్ పాడ్ ను మింగటం వల్ల ఆమెకు ఆరోగ్య సమస్య (Health problem) ఏమి రాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం తన భర్త (Husband) కు వివరించి చెప్పింది. దాంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు.
Also Read : దానిమ్మ పండు చేస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలు
విట మిన్ లు కలిగిన ఆహారం , సరైన వ్యాయామం బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఆధారం
గణేష్ విగ్రహాన్ని ఈ ప్రదేశం లో ఉంచితే చాలా మంచిదట, ఆ స్థలం ఏంటో మీకు తెలుసా?
కడుపులో ఉన్న ఎయిర్ పాడ్ ను ఎలా తొలగించాలి అని చాలామందిని అడిగారు. వారి రియాక్షన్స్, కామెంట్స్ విని వాళ్ళు చాలా భయపడ్డారు. చాలామంది వైద్యుల (Doctor’s) దగ్గరికి కూడా వెళ్లారు. అప్పుడు డాక్టర్లు ఒక వారం (Week) పాటు వేచి ఉండాలని చెప్పారు. మలవిసర్జన ద్వారా బయటికి రాకపోతే ఆపరేషన్ (Operation) చేసి బయటకు తీయాలని సూచించారు.
అయితే వారం తర్వాత ఆమె కడుపులో నుండి ఎయిర్ పాడ్ సహజంగానే బయటికి వచ్చింది. ఈ వీడియోని టిక్ టాక్ (Tik Tok) ద్వారా షేర్ (Share) చేశారు. ఈ వీడియో వైరల్ (Viral) గా మారింది. రకరకాల కామెంట్స్ కూడా వచ్చాయి. ఎయిర్ పాడ్ సరిగా పనిచేస్తుందా? అంటూ ఫన్నీ కామెంట్స్ (Funny comments) కూడా వచ్చాయి.