Telugu Mirror : క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం సమీపించింది. వరల్డ్ కప్ 2023 లోనే అత్యంత హీట్ ని పుట్టించే మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ హై టెన్షన్ పోరుకు ఆతిథ్యమివ్వనుంది. దాయాదితో పోరుకు టీమిండియా సంసిద్ధమైంది. శనివారం వరల్డ్ కప్ (World Cup) లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ను చూసేందుకు దేశం నలుమూలల నుండి అనేక మంది ప్రజలు అహ్మదాబాద్ కు వస్తున్నారు. ప్రపంచ కప్ మరియు ఆసియా కప్ (Asia Cup) సమయంలో మాత్రమే ఇండియా, పాకిస్తాన్ ఒకరితో ఒకరు పోటీపడటం మనం చూస్తూ ఉంటాం.
Also Read : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ, క్రికెట్ గాడ్ రికార్డు బద్దలు
వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు 7 సార్లు తలపడగా. టీమిండియానే 7 సార్లు విజయం సాధించింది. ఇప్పుడు ఎనిమిదో సారి కూడా పాకిస్తాన్‌ను చిత్తు చేయాలని టీమిండియా ధీమాతో ఉంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఈసారైనా టీమిండియాను ఓడించి లెక్కలు సరిచేయాలని చూస్తుంది.
అహ్మదాబాద్ లో ప్రస్తుత వాతావరణం :
2023లో భారత్ vs పాకిస్థాన్ 12వ ప్రపంచ కప్ మ్యాచ్ కి వరుని గండం ఉండకపోవచ్చు అని వాతావరణ సూచిక ద్వారా తెలిసింది. అహ్మదాబాద్‌లో అక్టోబర్ 14న అక్యూవెదర్ (Accuweather) యాప్ ని ఉపయోగించి వర్షం కురిసే అవకాశం లేదని అభిమానులకు శుభవార్త వ్యక్తం చేసింది. అహ్మదాబాద్‌లో, పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 35 నుండి 40 డిగ్రీలు ఉండగా, సాయంత్రం కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉంది.
Also Read : సహ్యాద్రి ఫామ్స్ టర్నోవర్ మొదటిసారిగా 1,000 కోట్ల మార్క్‌ను చేరుకుంది, మేనేజింగ్ డైరెక్టర్ విలాస్ షిండే
ఈ కీలక ఆట కోసం ఇరు జట్లు ఎటువంటి కాంబినేషన్ లో రాబోతున్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. సెంచరీల హీరో శుభ్‌మన్ గిల్ డెంగ్యూ నుంచి కోలుకుని ప్రాక్టీస్ ప్రారంభించాడు. దీంతో టీమ్‌లోకి శుభ్‌మన్ గిల్ వస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మ్యాచ్ (Match) ప్రారంభానికి ముందు వరకూ దీనిపై ఓ క్లారిటీకి రాలేని పరిస్థితి. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇదే గ్రౌండ్‌లో శుభ్‌మన్ గిల్ రెండు సెంచరీలు, మరో మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ (Fitness) సాధిస్తే గిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ గిల్ జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ బెంచ్‌కు పరిమితం కావాల్సి వస్తుంది.