Telugu Mirror : ICC క్రికెట్ ప్రపంచకప్ ఈరోజు ముంబై (Mumbai)లోని వాంఖడే స్టేడియంలో ప్రస్తుత ఛాంపియన్స్ గా ఉన్న భారత్, శ్రీలంకల మధ్య జరగనుంది.
ఆరు మ్యాచ్‌లు ఆడిన భారత్ (Bharath) ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లను ఓడించింది. పన్నెండు పాయింట్లతో, ప్రస్తుత పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉన్నారు మరియు ఆడిన ఆరు మ్యాచ్స్ ల్లో ఒక్కసారి కూడా ఓటమిని ఎదురుకోని ఏకైక జట్టు. భారత జట్టు మరో గేమ్ గెలిస్తే, వారు అధికారికంగా సెమీ-ఫైనల్‌కు వెళతారు. శ్రీలంక ఈ మ్యాచ్ ని ఓడిపోతే సెమీ-ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉండదు. ఈ మ్యాచ్ గెలించేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.
భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (1 సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో 398 పరుగులు), విరాట్ కోహ్లీ (1 సెంచరీ, మూడు అర్ధసెంచరీలతో 354 పరుగులు), లోకేశ్ రాహుల్ గట్టి పోటీని ఇస్తున్నారు. బౌలింగ్‌లో మహ్మద్ షమీ, జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వారి బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుని భయపెడుతున్నారు.
ఈ సందర్భంలో, రోహిత్ శర్మ నాకౌట్ వంటి గేమ్‌లో ఓడిపోతే, మొత్తం ఆరు మ్యాచ్‌లు గెలిచినందుకు ప్రోత్సహించే ప్రతి ఒక్కరూ అతనిని ఒక బ్యాడ్ కెప్టెన్ గా భావిస్తారని రోహిత్ శర్మ చెబుతున్నాడు. ప్రపంచకప్ గెలవకపోతే నిజంగా నిరాశ చెందుతానని, ఈ సిరీస్‌లో భారత్‌కు బలమైన ఆరంభాన్ని అందించడానికి తాను దూకుడుగా ఆడుతున్నానని చెప్పుకొచ్చాడు.
వరుణ్-లావణ్య కొత్త జంట, మూడు ముళ్ళ బంధంతో ఒకటైన పెళ్లి జంట
“మ్యాచ్ సరిగ్గా లేకపోయి ఉంటే, ఆటోమేటిక్ గా నేను బ్యాడ్ కెప్టెన్ (Bad Captain) అవుతాను” అని రోహిత్ శర్మ చెప్పాడు. ఈసారి ప్రపంచకప్ లో గెలవకపోతే చాలా నిరాశ చెందుతానని రోహిత్ చెప్తూ వచ్చాడు. ఇప్పుడు అతని బ్యాటింగ్‌తో సంతృప్తి చెందాడని మరియు అతను అదే సమయంలో జట్టుని దృష్టిలో ఉంచుకుని ఆడుతున్నాడని చెప్పాడు. మైదానంలో మంచిగ బ్యాటింగ్ చేస్తూ ఏ పరిస్థితిలోనైనా పరిస్థితికి తగ్గట్టుగా ఉంటాను అని చెప్పాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంక Srilanka) ఆటగాళ్లలో కొందరు గాయాల కారణంగా పక్కకి తప్పుకోవడంతో సబ్స్టిట్యూట్ గా వచ్చిన ఏంజెలో మాథ్యూస్ భారత్ కు గట్టి పోటీ ఇస్తున్నాడు. శ్రీలంక జట్టుకు అతని అనుభవం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భారత్ పై అతని బ్యాట్టింగ్ సగటు రేట్ 53.57 మరియు స్ట్రైక్ రేట్ 84.93. అయితే మాథ్యూస్ భారత జట్టుకు ఒక సమస్యగా మారాడు. ముంబైలోని మైదానం బ్యాట్టింగ్ మంచిగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మాథ్యూస్ భారత్ పై సెంచరీ కొట్టే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్ లో భారత్ గెలుస్తుందా లేదా అని చూడాలి.