Telugu Mirror :గ్లైన్ మాక్స్‌వెల్ అద్భుత ప్రదర్శనతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు మరియు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన పోరులో ODI పరుగుల వేటలో డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచకప్‌ల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) నొప్పితో పోరాడాడు మరియు ముంబైలో జరిగిన అద్భుతమైన ఆస్ట్రేలియా vs అఫ్ఘానిస్థాన్ ODIలలో పరుగుల వేటలో డబుల్ సెంచరీ కొట్టిన మొదటి బ్యాటర్ గా గ్లైన్ మాక్స్‌వెల్ నిలిచాడు.
Also Read : మీ కార్ ని స్మార్ట్ గా మార్చడానికి రిలయన్స్ జియో OBD కొత్త పరికరాన్ని ప్రారంభించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ (Afghanistan) నిర్ణీత 50 ఓవర్లలో అఫ్ఘానిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 143 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జద్రాన్ 50 ఓవర్ల పాటు క్రీజులో ఉండటం గమనార్హం. చివర్లో రషీద్ ఖాన్ 18 బంతుల్లో 35 పరుగులతో రాణించాడు.
292 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలను అఫ్ఘాన్ బౌలర్లు తొలుత కంగారు పెట్టేశారు. రెండో ఓవర్లోనే ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను నవీనుల్ హక్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత రెండు ఫోర్లు, రెండు సిక్సులతో జోరు మీదున్న మిచెల్ మార్ష్(24 )ను ఆరో ఓవర్లో ఎల్బీడబ్ల్యూ చేసి డబుల్ షాక్ ఇచ్చాడు. తొమ్మిదో ఓవర్లో ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్(18)ను, జోస్ ఇంగ్లిష్(0)ను అజ్మతుల్లా వరుస బంతుల్లో ఔట్ చేయడంతో 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత లబుషేన్ (14)రనౌట్ కావటంతో 69 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కంగారూల కష్టాలు రెట్టింపు అయ్యాయి.
91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశ నుంచి మ్యాక్సీ, కమిన్స్ జోడీ ఎనిమిదో వికెట్‌కు 202 పరుగులు జోడించింది. అందులో కమ్మిన్స్ వాటా కేవలం 12 పరుగులే అంటే మ్యాక్సీ జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. నొప్పిని భరిస్తూ జట్టుకోసం గాయాన్ని సైతం లెక్కచేయక అతనాడిన ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. స్విచ్ హిట్లు, రివర్స్ స్వీపులతో నిన్నటి వరకూ అతనాడిన ఆట వేరు ముంబైలోని వాంఖడేలో మ్యాడ్ మ్యాక్సీ ఆడిన ఆట వేరు. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ 128 బంతుల్లో 21 బౌండరీలు మరియు 10 సిక్సర్‌లతో కూడినది. ఇది ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ మరియు ODIల్లో రెండవ వేగవంతమైన డబుల్ సెంచరీ.