SSC Jobs Notification 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) రిక్రూట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)తో సహా ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలయింది. ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అధికారిక వెబ్సైట్ ssc.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు మార్చి 28న ముగుస్తుంది.
ఖాళీల వివరాలు ఒకసారి చూదాం..
ఈ రిక్రూట్మెంట్ లో SSC మొత్తం 4,187 మందికి సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఢిల్లీ పోలీస్‌లో ఎస్ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల కోసం మొత్తం 186 ఖాళీలు కేటాయించడం జరిగింది, ఇందులో పురుషులకు 125 మరియు మహిళలకు 61 స్థానాలు కేటాయించారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో జనరల్ డ్యూటీ పోస్టుల కోసం మొత్తం 4001 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Finally SSC CPO SI 2024 Notification Out. 🔥
Last Date for Apply – 28th March 2024
Exam Date – 2024 May 9th, 10th & 13th#ssc #cposi #ssccpo #ssccgl #cposi2024 pic.twitter.com/C1Rrg5a5bm— SSC News (@SSCorg_in) March 5, 2024
వయో పరిమితి ఎంత ఉండాలి?
దరఖాస్తుదారులు ఆగస్టు 1, 2023 నాటికి తప్పనిసరిగా 20 మరియు 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వం వారి విద్యార్హతల ఆధారంగా కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయో సడలింపును అందిస్తుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఢిల్లీ పోలీస్‌లో SI ఉద్యోగాలను కోరుకునే పురుష దరఖాస్తుదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే LMV (మోటార్ సైకిల్, కార్) డ్రైవింగ్ లైసెన్స్‌ని కలిగి ఉండాలి.
దీని కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అధికారిక వెబ్సైట్ అయిన ssc.gov.in ను సందర్శించండి. హోమ్‌పేజీలో, అప్లై అనే బటన్ ని క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ యొక్క ప్రత్యేకతలను సమీక్షించడానికి ‘Sub-Inspector in Delhi Police, CAPFs and Assistant Sub-Inspector in CISF Examination- 2024’ అనే లింక్‌ను క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
దాని తర్వాత, అప్లికేషన్ విధానాన్ని ప్రారంభించడానికి ‘ApplyNow’ బటన్ ని క్లిక్ చేయండి. వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసి, నమోదు ప్రక్రియను పూర్తి చేయండి.
రిజిస్టర్ ఐడితో లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్‌ను ఓపెన్ చేయాలి. అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.
దరఖాస్తు చేసుకోడానికి ఎంత రుసుము చెల్లించాలి?
జనరల్ మరియు ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం ఎలానో చూద్దాం..
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు ముందుగా పేపర్-1 అనే పరీక్ష ఉంటుంది. పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఫార్మాట్లో నిర్వహిస్తారు. మరియు మొత్తం 200 మార్కులను కలిగి ఉంటుంది. రెండవ దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) మరియు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ఉంటాయి. మూడవ దశలో మొత్తం 200 మార్కులతో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో పేపర్-2 పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. చివరగా, వైద్య పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 షెడ్యూల్‌ను ఎస్ఎస్సి ప్రకటించింది. మే 9, 10, 13 తేదీల్లో దేశవ్యాప్తంగా పలు చోట్ల పరీక్ష జరగనుంది.
SSC Jobs Notification 2024