Successful TS Minority Study Circle : విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ధేందుకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ప్రతి ఇంట్లో తమ పిల్లలను చదివిస్తున్నారు. సామాన్యులకు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశపడిన కూడా ఖర్చులకు వెనక అడుగు వేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ (Graduation) పూర్తి చేశాక ఉద్యోగాలను పొందేందుకు కోచింగ్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ, కోచింగులకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు.
అయితే, ఇప్పుడు మీకు ఆ దిగులు లేదు. ఎందుకంటే, ఉచితంగా కోచింగ్ (Free coaching) తీసుకెందుకు అభ్యర్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. మరి ఇంతకీ ఈ కోచింగ్ ఎవరికీ కోసం? అందరికి అందుబాటులో ఉంటుందా? అర్హత ఏమిటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
100 మంది మైనారిటీ అభ్యర్థులు UPSC – CSAT 2025 పరీక్షకు ఉచిత కోచింగ్
తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ స్టడీ సర్కిల్ (Telangana State Minority Welfare Study Circle) సంక్షేమ శాఖ ఈ విద్యా సంవత్సరంలో 100 మంది మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ను అందించనుంది. తెలంగాణ రాష్ట్ర మైనారిటీల స్టడీ సర్కిల్..2024-25 విద్యా సంవత్సరంలో 100 మంది మైనారిటీ అభ్యర్థులు UPSC – CSAT 2025 పరీక్షకు ఉచిత కోచింగ్ పొందుతారని మైనారిటీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ ప్రకటించింది.
అర్హులైన మైనారిటీ విద్యార్థులు ఏప్రిల్ 12లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహ్మద్ మీరాజ్ సూచించారు. ఈ శిక్షణ రిజర్వేషన్ విధానం ప్రకారం, 33.33 శాతం సీట్లు మహిళా అభ్యర్థులకు, 3% అన్ని పరిమిత కేటగిరీల్లో వికలాంగులకు కేటాయించడం జరిగింది.
దరఖాస్తు చేసుకోండి మరి..!
హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ మైనారిటీస్ స్టడీ సర్కిల్‌లో మొదటి సారి ప్రవేశం కోరుకునే అభ్యర్థులందరూ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిషన్ పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. UPSC (CSAT-2025) సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆన్‌లైన్ లో ఉంటుంది. అధికారిక వెబ్సైటు www.tmreistelanganaలో ప్రవేశం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జనరల్ ప్రొఫెషనల్ డిగ్రీని పూర్తి చేసిన మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోడానికి ఏప్రిల్ 12 చివరి తేదీ
దరఖాస్తులను ఏప్రిల్ 12లోగా.cgg.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. జిల్లా కేంద్రంలోని రంగంపల్లిలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఏప్రిల్ 28న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుందని తెలిపారు.అర్హులైన మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర సమాచారం కోసం 040-23236112 నంబర్‌కు కాల్ చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహ్మద్ మెరాజ్ మహమూద్ ప్రకటనలో తెలిపారు.