Telugu Mirror: చిన్న మధ్య తరగతి ప్రజలు వాళ్లకి వచ్చే ఆదాయంలో కొంత శాతం మ్యూచువల్ ఫండ్(Mutual fund), ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposit), పెన్షన్ స్కీమ్(Pension scheme,), ఇలా వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతా ఉంటారు అయితే పోస్ట్ ఆఫీస్ కు సంబంధించిన సుకన్య సమృద్ధి స్కీమ్ (Sukanya Samrudhi scheme)ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది.
ఇది మీ చిన్నారి ఆడ పిల్లల కోసం సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. పిల్లల వయస్సు పదేళ్ల లోపు ఉండాలి. ఒక కుటుంబంలో ఇద్దరు బాలికల కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా చిన్న మొత్తాన్ని చెల్లించి ఖాతాను తెరవచ్చు కేవలం 250 రూపాయలతో డిపాజిట్ ప్రారంభించడం సాధ్యమవుతుంది.
Also Read:RBI Bonds : రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన.. డబ్బులు దాచుకునే వారికి అదిరిపోయే ఆఫర్..
అలాగే 18 ఏళ్లు నిండిన తర్వాత ఆడపిల్లకు వివాహం జరిగితే ఖాతాను ముందుగానే మూసివేయవచ్చు. ఖాతాను భారతదేశంలో ఎక్కడికైనా ఒక పోస్టాఫీసు/బ్యాంకు(post office/bank) నుండి మరొకదానికి బదిలీ చేయవచ్చు
ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది.
Also Read:Fixed Deposite Rates : FD ల మీద 3 సంవత్సరాలకు 9% వడ్డీ రేటును ఇచ్చే 4 బ్యాంక్ లు..
ఈ పథకంలో సంవత్సరానికి 8% వడ్డీ రేటును పొందవచ్చు. ప్రతి ఏడాది చివరిలో వడ్డీ కలుస్తుంది. వడ్డీపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం పూర్తిగా “పన్ను రహితం”(no interest rate). ఆర్ధిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు డిపాజిట్ చెయ్యవచ్చు. సంవత్సరానికి కనీసం 250 రూపాయలు డిపాజిట్ చెయ్యాలి, లేక పోతే మీరు తెరిచిన ఖాతా చెల్లదు. ఏకమొత్తం పద్ధతిలో డిపాజిట్ చెయ్యవచ్చు. అమ్మాయి పేరు మీద ఒక్క అకౌంట్ మాత్రమే ఉండాలి.
సంవత్సరానికి ఒక సారి ఏక మొత్తం పద్ధతిలో విత్ డ్రా చెయ్యవచ్చు. గత ఏడాదిలో మిగిలిన బ్యాలన్స్ నుంచి 50% విత్ డ్రా చేసుకోవచ్చు. అమ్మాయికి 21 సంవత్సరాల వయస్సులో కానీ వివాహ సమయం నుంచి మూడు నెలల ముందు మొత్తం డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.