summer cool herbal drinks: వేసవి కాలంలో ఎక్కువగా పానీయాలు తగుతూ ఉంటాం. ఈ కాలంలో శరీరం (Body) ఎక్కువగా డీహైడ్రేట్ (De hydrate) అవుతుంది. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటాం. వేసవిలో నీటితో పాటుగా ఎలాంటి పానీయాలు తీసుకుంటే మంచిది? వేసవిలో హెర్బల్ డ్రింక్స్ (Herbal Drinks) తీసుకుంటే శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అయితే, వేసవిలో శరీరం హైడ్రేట్ గా ఉండేందుకు ఎలాంటి హెర్బల్ డ్రింక్స్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లు (Coconut Water)
వేసవిలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది. ఎందుకంటే, కొబ్బరి నీళ్లలో హైడ్రేటింగ్ (Hydrating) మరియు ఎలెక్ట్రోలైట్స్ (Electrolytes) అధికంగా ఉంటాయి. అలసట, వేడి ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.
పుచ్చకాయ రసం
వేసవిలో పుచ్చకాయలు విరివిగా దొరుకుతాయి. పుచ్చకాయలో అధిక శాతం నీరు ఉంటుంది. అయితే, పుచ్చకాయ రసం వేడిని తగ్గించడం తో పాటు శరీరాన్ని హైడ్రేట్ చేసి రిఫ్రెష్ (Refresh) గా ఉంచుతుంది. పుచ్చకాయలో ఉండే విటమిన్ ఎ (Vitamin A), విటమిన్ సి (Vitamin C), లైకోపీన్ సూర్య రశ్మి నుండి కాపాడడంలో సహాయపడుతుంది.
నిమ్మ రసం (Lemon Juice)
ఎండాకాలం వచ్చిందంటే అందరు నిమ్మరసాన్ని ఖచ్చితంగా తాగుతారు. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి బాడీ కి ఎనర్జీ ని ఇచ్చి రిఫ్రెష్ గా ఉంచుతుంది. జీర్ణ క్రియలో లో కూడా సహాయపడుతుంది. నిమ్మ రసం తాగడం వల్ల ఎండా వేడి నుండి కాస్త ఉపశమనం పొందవచ్చు.
అల్లం, నిమ్మరసం
అల్లం, నిమ్మరసంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అల్లం జీర్ణప్రక్రియలో సహాయపడుతుందని మన అందరికీ తెలుసు. దాంతో పాటు వికారం నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా, అల్లం నిమ్మరసంతో బాడీ హైడ్రేట్ (Hydrate) గా ఉంటుంది. అల్లం తురుము, నిమ్మరసం, తేనె ఐస్ ముక్కలు, నీరు కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు.
కలబంద జ్యూస్
కలబంద పేరు వినగానే ముఖ సౌందర్యానికి, చర్మ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుందని తెలుసు. కలబంద జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరడమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయ పడుతుంది. అలాగే మంటను కూడా తగ్గిస్తుంది. ఇది అంతగా రుచిగా ఉండదు కాబట్టి సాదాగా అయినా తాగొచ్చు లేదంటే ఏదైనా పండ్ల రసంలో అయిన కలిపి తాగొచ్చు.
పుదీనా టీ
వేసవిలో పుదీనా టీ మంచి పానీయంగా చెప్పవచ్చు. బాడీ కి పుదీనా టీ చల్లదనాన్ని అందించడమే కాకుండా మంటను తగ్గించడంలో, శ్వాసను తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. అజీర్ణం ఉన్నవాళ్లు వెంటనే ఉపశమనం పొందవచ్చు. వేడి నీటిలో ఎండిన పుదీనా లేదా పచ్చి పుదీనా వేసి కాసేపు ఉంచి వడకట్టి తాగండి.
గ్రీన్ టీ (Green Tea)
గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని మన అందరికీ తెలుసు. అయితే, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు (Anti Oxident) ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ క్రియను, మెదడు పని తీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుండెకి కూడా మంచిది.