Summer Tips: వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
మే నెల వచ్చిందంటే భయంకరమైన వేడి వాతావరణం చూస్తాం. మీ ఇంటిని ఎలా చల్లగా ఉంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
Summer Tips: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. మే నెల వచ్చిందంటే భయంకరమైన వేడి వాతావరణం చూస్తాం. వాతావరణం వేడిగా మారినప్పుడు, ఇల్లు కూడా వేడిగా మారుతుంది. ఏసీ (AC) లు అన్ని వేళలా ఆన్ చేయలేము. ఎందుకంటే విద్యుత్ ఖర్చులు (Current Charges) కూడా పెరుగుతాయి.అయితే, మీరు మీ ఇంటిని ఎలా చల్లగా ఉంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
ఇల్లు చల్లగా ఉండాలంటే చిన్నచిన్న పనులు కూడా చేయాలి. మీ ఇంటిలోని లైట్ బల్బులన్నింటినీ మార్చండి. LED లైటింగ్స్ వినియోగించడం వల్ల శక్తి ఆదా అవుతుంది. దీంతో ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. అదే ట్యూబ్ లైట్లు (Tube Lights) అయితే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అందుకే ఎల్ఈడీ బల్బుల (LED Bulb) ను ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉష్ణోగ్రత కొంత వరకు తగ్గుతుంది.
ఇంట్లో కూడా కాటన్ వస్త్రాలు (Cotton Dresses) ధరించండి. అవి వదులుగా ఉండేలా చూసుకోండి.దాంతో మీ శరీరం చల్లగా ఉంటుంది. దుస్తుల ద్వారా గాలి శరీరంలోకి వెళ్లేలా చూసుకోవాలి. అలాగే బెడ్‌లపై కాటన్ దుప్పట్లను మాత్రమే వాడాలి.
పెద్ద డిష్‌లో నీరు మరియు ఐస్ క్యూబ్స్ నింపి మీ గదిలో ఒక మూలలో ఉంచండి. ఫ్యాన్ గాలితో ఇల్లంతా చల్లబడుతుంది.
వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఎక్కువగా తాగాలి. చల్లటి నీటితో నానబెట్టిన గుడ్డతో ముఖాన్ని తుడుచుకుంటూ ఉండాలి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవి వేడి నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది.
Also Read: Rainfall Alert : తెలంగాణాలో మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు, పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్
ఇంట్లో ఏ గదిని ఎక్కువగా ఉపయోగిస్తారో ఆ గదిలోనే ఉండండి. వేరే గదులకు తలుపులు వేసి ఉంచండి.
వేసవిలో, ఇంట్లోని అన్ని సీలింగ్ ఫ్యాన్‌లను యాంటీక్లాక్‌వైస్‌గా తిరిగేలా సెట్ చేయండి. అప్పుడు గాలి నేరుగా క్రిందికి వస్తుంది.
మీరు తప్పనిసరిగా ఎయిర్ కండీషనర్‌ను ఉపయోగించినట్లయితే, దానిని 24 నుండి 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సెట్ చేయండి. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మీ ఇంటి కిటికీలు మరియు తలుపుల దగ్గర మొక్కలను అమర్చడానికి ప్రయత్నించండి. మొక్కలు వేడిని గ్రహిస్తాయి. చల్లని వాతావరణాన్ని కలిగిస్తుంది.
తరచుగా నీరు త్రాగటం మర్చిపోవద్దు. శరీరం నీటిని తీసుకుంటే బాడీ హైడ్రేట్ అవుతుంది. స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం మానుకోండి. ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా ఆహరం తీసుకోవాలి. మీరు ఎంత తక్కువ చక్కెర పానీయాలు తీసుకుంటే అంత మంచిది. వేసవిలో చక్కెర పానీయాలు ఎక్కువగా తీసుకుంటే, డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఉంటాయి. మజ్జిగ, నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి మంచిది.
డాబా యజమానులు తమ డాబాలను పెంచడం ద్వారా వేడిని తగ్గించవచ్చు. ఖాళీ స్థలం ఉంటే ఇంటి పక్కనే ఒక మొక్కను వేసి ఒక చెట్టుగా పెంచాలి. ఒక చెట్టుగా పెరిగితే, అది ఇంటికి నీడను అందిస్తుంది దాంతో వేడి తగ్గుతుంది. సొంత ఇల్లు కలిగి ఉన్న వారు చెట్టును నాటితే, దీర్ఘకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Comments are closed.