Telugu Mirror : టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఇంట్లో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్స్ (Prince) మహేష్ బాబు కూతురు సితార, కుమారుడు గౌతమ్ లు గణనాధునికి వైభవంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ లోని మహేష్ బాబు ఇంటిలో జరిగిన నిమజ్జన వేడుక వీడియో (Video) ను ప్రిన్స్ సతీమణి నమ్రతా శిరోద్కర్ తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేయగా ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమ ఇంట్లో పూజలు చేసిన గణపతిని ఇంటి ఆవరణలో నీటితో నిండిన ఓ డ్రమ్ము (Drum) లో నిమజ్జనం చేశారు. అయితే షేర్ (Share) చేసిన నిమజ్జన వీడియోలో మహేష్ బాబు, నమ్రతా ఎక్కడా కనిపించలేదు. గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఇంటిలోని పనివారితో కలిసి సితార పాప, గౌతమ్ బాబు నిర్వహించారు. మహేష్ బాబు సతీమణి నమ్రతా తన ఇన్ స్టా (Instagram ) లో ‘గణపతి బప్పా మోరియా..వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం’ అని రాసి పోస్ట్ చేసింది. అయితే మహేష్ బాబు కూతురు సితార పాప సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ (Active) గా ఉంటూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది.
కాగా..ఇటీవలనే మహేష్ బాబు కుమార్తె సితార తొలిసారిగా జ్యూయలరీ (Jewelry) యాడ్ లో నటించి సంచలనంగా మారింది. యాడ్ కోసం తను తీసుకున్న తొలి రెమ్యునరేషన్ (Remuneration) ను సైతం ఛారిటీకి ఇచ్చి తన గొప్ప మనసును చాటుకుంది. తన పుట్టిన రోజు (Birth Day) సందర్భంగా మహేష్ బాబు ఫౌండేషన్ లోని విద్యార్ధినులతో గడిపి వారికి సైకిళ్ళ (Cycles) ను బహుకరించింది. సితార నటించిన యాడ్ న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ (Times Square) లో ప్రదర్శించిన విషయం తెలిసిందే.
View this post on Instagram
అదేవిధంగా గౌతమ్ కూడా ఇటీవల మహేష్ బాబు ఫౌండేషన్ (Foundation) తరఫున చికిత్స పొందుతున్న పిల్లలకు ధైర్యం చెప్పి వాళ్ళతో గడిపి ఆనందాన్ని పెంచిన సంగతి ఇటీవల చూశాము. అలాగే తన పుట్టిన రోజు సందర్భంగా గత నెలలో సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన ఊరు (Village) బుర్రిపాలెంలో పలు సేవా కార్యక్రమాలతోపాటు వినికిడి లోపం ఉన్న వారికి హియరింగ్ మిషన్లు, స్పోర్ట్స్ కిట్లు పంపీణీ (Distribute) చేశాడు. వారందరి మధ్యనే పుట్టిన రోజు వేడుకలు జరుపు కున్నారు.
చాలామంది సెలబ్రిటీల (Celebrities) పిల్లలు పుట్టిన రోజు వేడుకలకు లక్షలలో ఖర్చు పెట్టి వేడుకలు జరుపుకుంటారు. కానీ మహేష్ బాబు పిల్లలు మాత్రం అందుకు పూర్తి విరుద్దమని చెప్పాలి.
ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం (Direction) లో ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. దీని తరువాత ప్రిన్స్ మహేష్.. రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా (Movie) లో నటించనున్నారు.