Support To Farmers: తెలంగాణలో ఈ మధ్య వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. ప్రజలు ఎండ వేడికి తట్టుకోలేక వర్షాలుపడడం వల్ల వాతావరణం చల్లబడడంతో సంతోషంగా ఉంటున్నారు. కానీ రైతులు మాత్రం పంట చేతికి రాక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రైతుల పంటలకు నష్టం జరిగింది. మరి ఈ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయనుంది? రైతులకు అండగా నిలుస్తుందా? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పంటలన్నీ నేలమట్టం
తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటకు అపార నష్టం వాటిల్లింది. పంటలన్నీ నేలమట్టం అవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెజారిటీలో నిమ్మ, బత్తాయి, దానిమ్మ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్
ఎక్కడ చూసినా వరి కోతలు పడిపోయాయి. పొలంలోనే మొలకలు ఎత్తాయి. బాధిత రైతులను ఆదుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు అందించాలని నిర్ణయించారు. దాని కోసం 15.81 కోట్లు ఖర్చు అవుతుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌లో ఎన్నికల సంఘం సమ్మతితో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి అంచనాల ఆధారంగా వ్యవసాయ నష్టపరిహారం అందజేయనున్నారు. ఇప్పటి వరకు 15,814 ఎకరాల్లో 15,246 మంది రైతులు పంటలు నష్టపోయినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.
ఇటీవల ప్రభుత్వం రైతులకు అద్భుతమైన వార్త అందించింది.
ఎకరాకు రూ.10 వేలు
వడగళ్ల వాన, ఆలస్యమైన వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. 15,246 మంది రైతులకు చెందిన 15,814 ఎకరాలకు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ మేరకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.15.81 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం అనుమతితో రైతుల ఖాతాల్లోకి పరిహారం చెల్లించనున్నారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు, రైతుకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసి వరికీ రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటన చేశారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటాం అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆగస్టు 15లోపు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ. అలాగే అన్నదాతలకు తదుపరి సీజన్‌తో రూ. 500 బోనస్ ప్రారంభమవుతుంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…