Taiwan Earth Quake 2024: 25 ఏళ్ళ తరువాత తైవాన్ లో అత్యంత భారీ భూకంపం. ద్వీపాన్ని వణికించిన భూకంపం,పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Taiwan Earth Quake 2024

Taiwan Earth Quake 2024: తైవాన్‌లో బుధవారం సంభవించిన శక్తివంతమైన భూకంపం వల్ల కనీసం నలుగురు వ్యక్తులు మరణించారు మరియు సుమారు 60 మంది గాయపడ్డారు, భూకంప ప్రభావం డజన్ల కొద్దీ భవనాలను ధ్వంసం చేసింది మరియు జపాన్ మరియు ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలను జారీ చేసేందుకు కారణమైంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4 గా నమోదైంది.
తైవాన్ అధికారులు పేర్కొన్న ప్రకారం దశాబ్దాల కాలంలో ద్వీపాన్ని అతలాకుతలం చేసిన భూకంపం చాలా బలమైందని, దీనివలన రానున్న రోజుల్లో మరిన్ని ప్రకంపనలు రావడానికి అవకాశం ఉందని హెచ్చరించారు.
తైపీ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సీస్మాలజీ సెంటర్ డైరెక్టర్ వు చియెన్-ఫు ప్రకారం “భూకంప కేంద్రం భూమికి సమీపంగా ఉంది మరియు నిస్సారంగా ఉంది. ప్రకంపనలు తైవాన్ మరియు ఆఫ్ షోర్ దీవులు మొత్తం వ్యాపించాయి.”
నిర్మాణ నిబంధనలు కఠిన తరంగా ఉండడం మరియు విపత్తులపై అవగాహన కలిగి ఉండటం మూలాన ఈ ద్వీపానికి ఒక పెద్ద విపత్తును దూరం చేసిందని భావిస్తున్నారు. ఇది రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్‌కు సమీపంలో ఉన్నందున తరచుగా భూకంపాలకు గురవుతుంది.
ద్వీపం యొక్క చరిత్రలో 1999 సెప్టెంబరులో రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో ఏర్పడిన అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యంలో సుమారు 2,400 మంది చనిపోయిన తర్వాత ఈ భూకంపం అత్యంత బలమైనదని తైపీ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సీస్మాలజీ సెంటర్ డైరెక్టర్ వు చియెన్-ఫు పేర్కొన్నారు.
బుధవారం సంభవించిన భూకంపం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:00 గంటల ముందు (0000 GMT) సంభవించింది, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తైవాన్‌లోని హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలోమీటర్లు (11 మైళ్లు) 34.8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించింది.
నగరాన్ని చుట్టుముట్టిన కొండల గుండా తెల్లవారుజామున పాదయాత్ర చేస్తున్న ఏడుగురు వ్యక్తుల బృందంలో ముగ్గురు వ్యక్తులు భూకంపం వలన పగిలిన బండరాళ్లలో నలిగి చనిపోయారు అని తైపీ అధికారులు వార్తా సంస్థలతో తెలిపారు.
మరో ప్రక్క, ఆ ప్రాంతంలోని సొరంగం వద్దకు రాగానే కొండచరియలు విరిగిపడటంతో ట్రక్కు డ్రైవర్ మరణించాడు.
భూకంపం సంభవించినప్పుడు ఊగిసలాడుతున్న భవనాల వీడియోలు మరియు దేశవ్యాప్తంగా ఉన్న భూకంప శిధిలాల చిత్రాలతో సోషల్ మీడియా నిండిపోయింది.
రాజధాని తైపీలోని ఒక హోటల్‌లో తొమ్మిదవ అంతస్తులో ఉన్న లిఫ్ట్ లాబీలో ఉన్న టూరిస్ట్ కెల్విన్ హ్వాంగ్ తెలిపిన ప్రకారం, “నేను పరిగెత్తాలని అనుకున్నాను, కానీ నేను దుస్తులు ధరించలేదు. ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి.”
హువాలియన్‌లోని బహుళ-అంతస్తుల నిర్మాణాల యొక్క శిధిల చిత్రాలు స్థానిక టీవీలో ప్రదర్శించబడ్డాయి మరియు భూకంపం ముగిసిన తర్వాత కొన్ని చోట్ల భవనాలు ఒరిగాయి, న్యూ తైపీ సిటీలోని ఒక గిడ్డంగి శిథిలమైంది.


కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 100,000 మంది జనాభా కలిగిన పర్వతం చుట్టూ విస్తరించి ఉన్న తీరప్రాంత నగరమైన హువాలియన్‌లో రోడ్ల వెంట పడిన బండరాళ్లను బుల్డోజర్లు తొలగిస్తున్నట్లు స్థానిక TV ఛానెల్‌లు చూపించాయి.
తైవాన్ అధ్యక్షుడు సాయ్ ఇంగ్-వెన్ స్థానిక మరియు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు పరస్పరం సమన్వయం చేసుకొని సహాయక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు జాతీయ సైన్యం కూడా సహాయ కార్యక్రమాలలో పాల్గొంటుందని చెప్పారు.
మృతుల సంఖ్యను నేషనల్ ఫైర్ ఏజెన్సీ ధృవీకరించింది, దాదాపు 60 మంది భూకంప సంబంధిత బాధితులు గాయాలకు చికిత్స పొందారని తెలిపింది.అధికారులు మొదట తైవాన్, జపాన్ మరియు ఫిలిప్పీన్స్‌లలో సునామీ హెచ్చరికను జారీ చేశారు, అయితే సుమారు ఉదయం 10 గంటలకు (0200 GMT), పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ముప్పు తొలగిపోయింది అని తెలిపింది.
రాజధానిలో, మెట్రో రన్నింగ్ కొద్ది సేపు ఆగిపోయింది కానీ తిరిగి ఒక గంటలోపు ప్రారంభమైంది.
రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్‌కు ద్వీపం సమీపంలో ఉన్నందున తైవాన్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి, సమీపంలోనే ఉన్న జపాన్ ప్రతి సంవత్సరం దాదాపు 1,500 కుదుపులను ఎదుర్కొంటుంది.
తైవాన్ జలసంధిలో, దక్షిణాన గ్వాంగ్‌డాంగ్ సరిహద్దులో ఉన్న చైనా తూర్పు ఫుజియాన్ ప్రావిన్స్‌లోను మరియు ఇతర చోట్ల కూడా బలమైన ప్రకంపనలు వచ్చినట్లు సోషల్ మీడియాలో పలువురు చెప్పారు.
హాంకాంగ్ వాసులు కూడా భూకంప ప్రకంపనలను ఎదుర్కొన్నారు.
తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మేకర్ — కొన్ని ప్లాంట్‌లలో కొంత మేర అంతరాయం కలిగిందని కంపెనీ అధికారి తెలిపారు, అయితే కొత్త ప్లాంట్లను నిర్మిస్తున్న ప్రదేశాలలో రోజువారీ పని ఆగిపోయింది.
భూకంపాలు చాలా వరకు స్వల్పంగా ఉంటాయి, అయినప్పటికీ వాటి వల్ల కలిగే నష్టం భూమి యొక్క ఉపరితలం క్రింద ఉన్న భూకంప కేంద్రం యొక్క లోతు మరియు దాని స్థానాన్ని బట్టి మారుతుంది.

Taiwan Earth Quake 2024

 

 

 

 

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in