Telugu Mirror : భారతదేశంలో ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. చాలా కంపెనీలు రూ.20 వేల నుంచి రూ.30 వేల ధరకు పెర్ఫామెన్స్, మంచి కెమెరాలతో కూడిన స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. అన్ని విభాగాల్లోనూ మంచి పనితీరుతో మొబైల్‌లను విడుదల చేస్తోంది. అందుకే ఈ మధ్య కాలంలో రూ.30 వేల లోపు సెగ్మెంట్ మొబైల్స్ కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా తక్కువ బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా, అయితే ఆ రేంజ్‌లో బెస్ట్ అయిన కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. రూ.30 వేల లోపు అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లు ఇవే.
Realme 11 5G :
రియల్ మీ 11 5G స్మార్ట్ ఫోన్ MediaTek Dimension 6100 Plus ప్రాసెసర్ తో వస్తుంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ యొక్క ప్రాముఖ్యత మరియు అద్భుతమైన వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 8 జీబీ + 128 జీబీతో పాటు 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ‘గ్లోరీ హాలో’ డిజైన్‌తో నలుపు, బంగారపు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 17,999 గా ఉంది.
OnePlus Nord CE 3 Lite 5G :
6.72 ఇంచుల Full HD+ LCD డిస్‍ప్లేతో వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ వస్తుంది. వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్‍లో స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 (Android 13) ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 పై రన్ అవుతుంది.108 మెగాపిక్సెల్ సామ్‍సంగ్ HM6 ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ కలిగి ఉంది. 67 వాట్స్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 19,999 గా ఉంది.
Realme 11 Pro :
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇటీవల రిలీజ్ చేసిన రియల్ మీ 11 ప్రో ఫోన్ గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో పని చేసే ఈ ఫోన్ గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 23,999 గా ఉంది.
Realme 11 Pro Plus :
రియల్మీ 11 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ కూడా మంచి ఫీచర్లను కలిగి ఉంది. 200 మెగా పిక్సెల్ కెమెరాతో ఫొటొగ్రఫీకి ఈ ఫోన్ చక్కగా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్ కలిగి ఉంది. 6.7 అంగుళాల కర్వ్డ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 27,999 గా ఉంది.
Redmi Note 12 pro plus :
ఈ రెడ్‌మి 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో మీరు 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరియు 5000 mAh శక్తివంతమైన బ్యాటరీని పొందుతారు. ఈ స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్ కోసం MediaTek డైమెన్షన్ 1080 చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ 8GB+256GB మరియు 12GB+256GB రెండు వేరియంట్‌లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 27,500 గా ఉంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…