Telugu Mirror : రేటు చూస్తే అంత ! మరి తాగితే కిక్కు ఎంత ?

Telugu Mirror  : మానవుని దైనందిన జీవితంలో అంతర్భాగం ‘టీ’ (Tea). కొంత మందికి ఒత్తిడి నుండి ఉపశమనానికి,అలాగే ఉదయం లేవగానే ప్రతి కుటుంబం లో మొదటిగా చేసే పని టీ త్రాగడం. టీ దీనినే తేనీరు అని కూడా అంటారు.మానవ దేహానికి ఉత్తేజాన్ని కలిగించేదిగా పేర్కొంటారు. అలాంటి ఉత్తేజాన్ని అందించే తేనీరు ని తయారు చేసే విధానంలో ముఖ్యమైనది తేయాకు(Tea powder ).టీ పొడిలో అనేక రకాలైనవి ఉన్నాయి.కానీ కిలో టీ పొడి రూ.85 వేలు ధర ఉన్న టీ పొడి గురించి విన్నారా?ఆయితే రండి తెలుసుకుందాం.

Telugu Mirror : మీ కొత్త బ్యాంక్ ఖాతాకి PF అకౌంట్ లింక్ చేయండి ఇలా….

తమిళనాడు లోని నీలగిరి జిల్లాలో తేయాకు (The Tea leaf) సుమారు లక్ష ఎకరాలలో పండించబడుతుంది. ఇక్కడ సాగు చేసిన తేయాకు ద్వారా నీలగిరి జిల్లాలో 16 ప్రభుత్వ మరియు 180 ప్రైవేట్ ఫ్యాక్టరీ లలో టీ పొడి తయారు అవుతుంది.
ఇక్కడ ప్రతి వారం వేలం జరుగుతుంది. ఇక్కడ తయారు చేసే టీ పొడిని ప్రభుత్వ వేలం సంస్థ ఇండ్ కో సర్వ్ మరియు ప్రైవేట్ వేలం కేంద్రం కూనూర్ టీ ట్రేడర్స్ అసోసియేషన్ ద్వారా సాధారణంగా, రెండురకాల సాంప్రదాయ బద్దమైన తేయాకు మరియు CDC డస్ట్ వేలం వేస్తారు. వేలంలో సుమారు 15 లక్షల కిలోల టీ పొడి అమ్ముడుపోతుంది.

వాతావరణం లో మార్పులు,ధుర్భిక్షం మరియు చీడపీడల దాడి వలన తేయాకు ఉత్పత్తి చాలా తగ్గిపోతోంది. 180 సంవత్సరాల చరిత్ర కలిగిన టీ పొడి పరిశ్రమలో కొన్నిసార్లు నాణ్యత కోల్పోయి ధర గిట్టుబాటు అవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో,వైట్ టీ,గ్రీన్ టీ, బ్లాక్ టీ లాంటి కొన్ని విలువైన ప్రత్యేకంగా తయారుచేసిన టీ లను అధిక ధరలకు అమ్ముతారు.విలువైన ఈ టీ ల( Tea )యొక్క ఉత్పత్తి తక్కువగా ఉంటుంది.దానివలన వాటి ధర అధికంగా ఉంటుంది.
పండ్లు మరియు మసాలా దినుసులు కలపడం ద్వారా 200 కంటే ఎక్కువ రుచులలో ప్రత్యేక మైన టీ పొడులు ఉత్పత్తి చేస్తారు.

Tea plant's

 

ఇలా ప్రత్యేకంగా తయారుచేసిన స్పెషల్ టీ పొడులను కిలో రూ.400 నుంచి అత్యధికంగా రూ.85 వేల ధరకు అమ్ముతున్నారు. ‘బ్లాక్ టీ'(Black Tea) బ్రాండ్ టీ పొడిని కిలో రూ.85 వేలకు విక్రయిస్తున్నారు.టీ తలసరి వినియోగాన్ని అధికంగా పెంచే ఉద్దేశ్యంతో కళాశాల మరియు పాఠశాల విధ్యార్థులకు వివిధ రకాల అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు.అలాగే టీ ధరను పెంచేందుకు సౌత్ ఇండియన్ టీ బోర్డ్ వివిధ చర్యలు చేపట్టింది.

దానిలో భాగంగానే ప్రస్తుతం విద్యార్ధులతో కార్యక్రమాలు. అలాగే పర్యాటకులకు నీలగిరి జిల్లాలో నుండి ఉత్పత్తి అయ్యే ప్రత్యేక టీ పొడిని పరిచయం చేసి,దానికి ఆదరణ కలిగించేలా దక్షిణ భారత టీ బోర్డ్ వారిచే ఉతగై గిరిజన సాంస్కృతిక కేంద్రంలో టీ సెంటర్ ను ప్రారంభించడం ద్వారా, టీ సెంటర్ లో స్పెషల్ టీ పౌడర్ మరియు ప్రత్యేక టీ అమ్మకానికి ఉంచారు.

New Rules For Fast Tag: మీ వాహనం కి ఇప్పుడు ఇది అమర్చడం తప్పనిసరి. మారనున్న టోల్ ప్లాజా రూల్స్

టీ పరిశ్రమలలో సేవలకు గాను టీ బోర్డ్ ఆఫ్ ఇండియా చేయూత అందుకున్న మొట్ట మొదటి టీ హౌస్ ఉతగై టీ సెంటర్. ప్రత్యేక టీ లను, టీ బోర్డ్ సహకారం తో ఉత్పత్తి చేసే రైతులకు టీ హౌస్ మంచి వ్యాపార ప్రదేశమని, టీ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిర్మల్ తెలిపారు.
ఇక్కడి టీ పొడిలో 80 శాతం టీ పొడిని భారత దేశం మొత్తం రైతులు మరియు చిన్న తేయాకు సాగుదారుల నుండి సేకరించామని,ప్రస్తుతం కిలో టీ పొడి రూ.400 నుండి రూ.85 వేలకు విక్రయిస్తున్నామని టీ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నిర్మల్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.