Tech Mahindra Jobs : హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ వ్యాపార సంస్థ టెక్ మహీంద్రా (tech mahindra) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రాజెక్ట్ మేనేజర్ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ (hyderabad) లో పనిచేయాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం మరియు దరఖాస్తు కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
పోస్టులు : ప్రాజెక్ట్ మేనేజర్.
అర్హత : డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో 6 నుండి 12 సంవత్సరాల నైపుణ్యంతో పాటు.S/4 HANA-1 ఫైనాన్షియల్ అకౌంటింగ్ సామర్థ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్ : హైదరాబాద్
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : మే 23, 2024.
ఓవైపు ఆటోమేషన్ (automation) , మరోవైపు AI టెక్నాలజీ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకోవడం కూడా ఆపేశాయి కొన్ని కంపెనీలు. ఏకంగా ఐఐటీల్లో కూడా విద్యార్థులు ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇదే తరుణంలో భారత్‌కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం టెక్ మహీంద్ర శుభవార్త తెలిపింది.
రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపడతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏకంగా 6000 మంది ఫ్రెషర్‌లను రిక్రూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయమై టెక్ మహీంద్ర మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మోహిత్ జోషి మాట్లాడుతూ. ప్రతీ త్రైమాసికంలో 1500 మంది ఫ్రెష్ గ్యాడ్యుయేట్‌లను నియమించుకోనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా తమ ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంచే దిశగా కూడా టెక్ మహీంద్ర అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది 50,000 మందికి పైగా ఉద్యోగులకు కృత్రిమ మేధస్సుపై శిక్షణ ఇస్తున్నట్లు మోహిత్ జోషి తెలిపారు.
టెక్ మహీంద్ర ఉచిత ఉపాధి శిక్షణ.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్ మహీంద్ర ఫౌండేషన్ 4 నెలల పాటు ఉచిత ఉపాధి శిక్షణ (Free Skill Training) ఇస్తున్నట్లు హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ సమన్వయకర్త శ్రీధర్ వెల్లడించారు. 18-27 వయస్సు కలిగి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీలో ఉత్తీర్ణులు, అనుత్తీర్ణులైన వారికి కంప్యూటర్ బేసిక్స్ (Computer Basics) , ఎంఎస్ ఆఫీస్-2010, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఇంగ్లిష్ టైపింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్‌లో, అలాగే బీకామ్ ఉత్తీర్ణులకు టాలీ ఈఆర్‌పీ 9, బేసిక్ అకౌంట్స్, అడ్వాన్స్‌డ్ ఎంఎస్-ఎక్సెల్ శిక్షణ ఉంటుందని తెలిపారు.