Telugu Mirror: చైనీస్ మొబైల్ ఫోన్ తయారీదారు Tecno Pova 5 సిరీస్ త్వరలో భారతదేశంలోకి రాబోతుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో Tecno Pova 5 మరియు Tecno Pova 5 Pro మోడల్స్ ఉన్నాయి. ఆగస్టు 14న భారతదేశంలో Tecno Pova సిరీస్ ప్రారంభం అవుతాయి. ఈ రెండు హ్యాండ్ సెట్ లు Full-HD+ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లే ను కలిగి ఉంటాయి. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ పరికరాలు వివిధ లక్షణాలను ఒకదానితో మరొకటి పంచుకుంటాయి. డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ లతో, Tecno Pova 5 మరియు Pova 5 Pro రెండూ Android 13 -ఆధారిత హ్యుమన్ ఇంటరాక్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ (HiOS) పై రన్ అవుతాయి. ముఖ్యంగా, ప్రో వేరియంట్ గతంలో అంచనా వేసిననట్లుగా ఆర్క్ ఇంటర్ ఫేస్ LED లైట్లను కలిగి ఉంది.
Tecno Pova 5 మరియు Pova 5 Pro గతంలో ఈవెంట్‌లో బహిర్గతం అయినప్పటికీ వాటి యొక్క అధికారిక విడుదల ఆగస్టు 14న నిర్ణయం చేయబడింది, వాటి విడుదల ప్లాట్ ఫామ్ మీద ధర గురించి వివరాలు వెల్లడి అవుతాయని భావిస్తున్నారు. ఈ పరికరాలు కొనుగోలు చేసే వారికి అమెజాన్ లో అందుబాటులో ఉంటాయి .
Tecno Pova 5 మోడల్ మేచా బ్లాక్, హరికేన్ బ్లూ మరియు అంబర్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో అందించబడుతుంది. మరో డివైజ్ Pova 5 Pro సిల్వర్ ఫాంటసీ మరియు డార్క్ ఇల్యూజన్ కలర్ ఎంపికలలో అందుబాటులోకి వస్తుంది.
Also Read:శామ్సంగా మజాకా.. దుమ్ము రేపుతున్న Samsung.. రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్ లు..
Tecno Pova 5 స్పెసిఫికేషన్స్
Tecno Pova 5 మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండి 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.78-అంగుళాల Full-HD+ డిస్‌ప్లేను వస్తుంది. ఈ పరికరం ఆక్టా-కోర్ MediaTek Helio G99 SoC ద్వారా ఆధారితమైనది, అదేవిధంగా 16GB RAM మరియు 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, అలాగే మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 256GB వరకు ఎక్స్పాండ్ చేయవచ్చు.
కెమెరా పనితీరు
Tecno Pova 5 LED ఫ్లాష్‌ను కలిగి, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు AI లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 8 – మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.
హ్యాండ్ సెట్ సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది డ్యూయల్ 4G VoLTE, WiFi, బ్లూటూత్ 5.0, GPS, USB టైప్-C, NFC మరియు 3.5mm ఆడియో జాక్‌లను కనెక్టివిటీ పరంగా అందిస్తుంది. Tecno Pova 5 బలమైన 6,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు ను అందిస్తుంది.
Tecno Pova 5 ప్రో స్పెసిఫికేషన్స్
Tecno Pova 5 Pro దాని వెనుక ఒక ప్రత్యేకమైన ARC ఇంటర్‌ఫేస్‌ను ఇంట్రడ్యూస్ చేసింది, నథింగ్ 2 లో వలే ఇది ఆకర్షణీయంగా కనబడుతోంది. Arc ఇంటర్‌ఫేస్లు నోటిఫికేషన్‌లు మరియు ఇతర సంకేతాలను ఇవ్వడం కోసం LED లైట్లు అమర్చబడి ఉంది. కెమెరా సెటప్ మరియు డిస్ ప్లే ఫీచర్లు Tecno Pova 5 మోడల్‌కి అచ్చు గుద్దినట్లు సరిపోలతాయి.
అయితే, Tecno Pova 5 Pro, MediaTek Dimensity 6080 SoC, మాలి-G57 MC2 CPUతో ఆధారితమై పనిచేస్తుంది. ఈ వేరియంట్ లోని ముందు భాగంలోని కెమెరా 16-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. పరికరం 68W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.