3D Calling Technology : ప్రతి రోజు, టెక్నాలజీ కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది. ల్యాండ్‌లైన్ ఫోన్‌ల నుండి అదిరిపోయే ఫీచర్లు కలిగిన మొబైల్ ఫోన్‌లకు మారారు. అంతే కాదు, వీడియో కాల్ టెక్నాలజీకి కూడా అభివృద్ధి చేసి, ఎక్కడ ఉన్న వీడియో కాల్ లో చూసుకొని మాట్లాడుకునే అవకాశాన్ని ఇప్పుడు అందరం సద్వినియోగం చేసుకుంటున్నాం. అయితే, నోకియా కొత్త టెక్నాలజీని ఉపయోగించి 3డి కాలింగ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
నోకియా యొక్క 3D కాలింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి?
కొత్త టెక్నాలజీని ఉపయోగించి ‘ఇమ్మర్సివ్ కాలింగ్’ను ప్రారంభించినట్లు నోకియా తెలిపింది. నోకియా CEO అయిన పెక్కా ల్యాండ్‌మార్క్ కొత్త టెక్నాలజీని వివరించి, దాన్ని ఉపయోగించి కాల్ చేసిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
కొత్త 3GPP ఇమ్మర్సివ్ వాయిస్ మరియు ఆడియో సర్వీస్ (IVAS) కోడెక్‌ని ఉపయోగించే ఈ కొత్త కాలింగ్ టెక్నాలజీ, మోనోఫోనిక్ టెలిఫోనీకి భిన్నంగా ప్రత్యక్ష కాలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. లైవ్ లో మాట్లాడుతూ, మేము ప్రస్తుతం ఉపయోగిస్తున్న మోనోఫోనిక్ స్మార్ట్‌ఫోన్ వాయిస్ కాల్ అనుభవానికి భిన్నంగా IVAS కోడెక్ 3D స్పేషియల్ సౌండ్‌తో నిజ జీవిత అనుభవాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఫ్యూచర్ 5G అడ్వాన్స్‌డ్ స్టాండర్డ్ కోసం నోకియా టెస్టులలో IVAS కోడెక్ ఒకటి. ఈ టెక్నాలజీతో, వినియోగదారులు అద్భుతమైన లైవ్ కాలింగ్ అనుభవాన్ని పొందుతారు. ఈ రోజు ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి స్మూత్ గా కాల్ నిర్వహించినట్లు నోకియా పేర్కొంది.
అయితే, ఈ కొత్త 3D స్పేషియల్ ఇమ్మర్సివ్ కాలింగ్ టెక్నాలజీ వినియోగదారులకు అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పుడు, ఇది ఒక అద్భుతమైన కాలింగ్ అనుభవాన్ని అందజేస్తుంది, అవతలి వ్యక్తి మన పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది.
3D Calling Technology
Also Read : WhatsApp calls Record : వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయడం ఎలానో తెలుసా? ఈ సింపుల్ ట్రిక్ అప్లై చేయండి!