Telugu Mirror : రిలయన్స్ జియో (Reliance Jio) తన కస్టమర్లకు మరో రెండు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో కంపెనీ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ (Netflix Subscription) తో కూడిన రెండు ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లను ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్ కోసం ఇది ప్రపంచ వ్యాప్తంగా మొదటి ప్రీపెయిడ్ సమూహ భాగస్వామ్యం అని కంపెనీ తెలిపింది.
జియో సిఈఓ కిరణ్ థామస్ (CEO Kiran Thomas) ప్రకటించిన ప్రకారం జియో తన కస్టమర్స్ కోసం గ్లోబల్ స్థాయిలో సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. జియో ప్రీపెయిడ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ ప్యాకేజ్ (Netflix Package) లను ప్రారంభించడం కస్టమర్ల పట్ల మా ధృడ నిశ్చయాన్ని చూపించడానికి మరో మెట్టు. Netflix వంటి ప్రపంచ స్థాయి పార్టనర్ షిప్ తో మా భాగస్వామ్యం మరింత ధృదపడింది అలాగే మేము Netflix తో కలయికను ఉపయోగించుకుని ప్రపంచంలోని ఇతర దేశాలు మమ్మల్ని అనుసరించాల్సిన విషయాలను కలసి చేస్తున్నాము” అని జియో ప్లాట్‌ఫారమ్‌ల సీఈఓ కిరణ్ థామస్ తెలిపారు.
Reliance Jio: త్వరలో జియో నుంచి అద్భుతమైన ఫీచర్స్ తో రెండూ 5G స్మార్ట్ ఫోన్స్ విడుదల
ఎంపిక చేసుకున్న జియో పోస్ట్‌పెయిడ్ మరియు జియో ఫైబర్ ప్లాన్ (Jio Fiber Plan) లలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అనేది ఇప్పటికే అందుబాటులో ఉంది , అయితే ప్రీపెయిడ్ ప్లాన్ లలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ను అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి.
ప్రీపెయిడ్ ప్లాన్ లకు సబ్స్క్రిప్షన్ అందుబాటులోకి తీసుకురావడం వలన, 400 మిలియన్లకు పైగా జియో ప్రీపెయిడ్ వినియోగదారులు జియో ప్రీపెయిడ్ బండిల్ ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు.
కంపెనీ రెండు ప్లాన్‌లను విడుదల చేసింది ఒకటి రూ.1,099 మరొకటి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ రూ.1,499.
రూ. 1,099 ప్లాన్ Netflix మొబైల్ సబ్స్క్రిప్షన్, అపరిమిత 5G డేటా లేదా రోజుకు 2GB 4G డేటా మరియు అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది
కేవలం మొబైల్ ఫోన్‌లలో మాత్రమే కంటెంట్‌ని చూడటానికి Netflix మొబైల్ విడిగా నెలకు రూ.149 ప్లాన్ ను అనుమతిస్తుంది.
రూ.1,499 ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ యొక్క ప్రాథమిక అంశాలను అందిస్తుంది, ఇది వినియోగదారులు ఒకే సమయంలో మొబైల్ లేదా టెలివిజన్‌లో చూడటానికి అవకాశం ఉంది. తక్కువ-ధర వెర్షన్ రోజుకు 3GB 4G డేటాను అందిస్తుంది. కానీ తక్కువ ప్రయోజనాలతో వస్తుంది.
భారతదేశంలో నెట్ ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ (Netflix Basic Plan) విడిగా నెలకు రూ .199.
రూ.719 ధర కలిగిన 2GB డేటా ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. మరియు 3GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ ,84 రోజుల చెల్లుబాటుతో ప్లాన్ ప్రారంభ ధర రూ. 999.